ఈ నీటిలో ఎవరైనా తేలుతారు...
ABN , Publish Date - Aug 17 , 2025 | 01:40 PM
ఇది నిజమేనా? అనే ప్రశ్న వస్తుంది ఈ ఫొటోలు చూస్తే... ముత్యాల్లా మెరిసే ఇసుక రేణువుల మధ్య, అందంగా పేర్చినట్టు నీటి మడుగులు. అందులో నీలం, ఆకుపచ్చ రంగుల కలబోత. ఒక అద్భుత కళాచిత్రంగా అనిపించే ఈ దృశ్యం ఈజిప్టులోని ‘సివా’ ఉప్పు నీటి సరస్సులున్న ప్రాంతం.
- ఉప్పునీటి ఒయాసిస్
ఇది నిజమేనా? అనే ప్రశ్న వస్తుంది ఈ ఫొటోలు చూస్తే... ముత్యాల్లా మెరిసే ఇసుక రేణువుల మధ్య, అందంగా పేర్చినట్టు నీటి మడుగులు. అందులో నీలం, ఆకుపచ్చ రంగుల కలబోత. ఒక అద్భుత కళాచిత్రంగా అనిపించే ఈ దృశ్యం ఈజిప్టులోని ‘సివా’ ఉప్పు నీటి సరస్సులున్న ప్రాంతం. రాజధాని కైరో నుంచి సివా నగరానికి ఎనిమిది గంటల ప్రయాణం. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘సివా ఒయాసిస్’లు. వాటిల్లో క్లియోపాత్రా స్నానమాచరించిన ఒయాసిస్ కూడా ఉందట.

అక్కడి ఉప్పు గనుల్లో వందల సంఖ్యలో ఇలా నీటి సరస్సులు ఏర్పడ్డాయి. అతి స్వచ్ఛమైన ఈ టార్కోయిస్ జలాల్లో ఈదులాడటం ఉల్లాసమే కాకుండా, ఆరోగ్యపరంగా మంచిదని అంటారు. అధిక లవణాల కారణంగా ఈ నీటిలో ఎవరైనా తేలుతారు. ‘ఈజిప్టు ప్యారడైజ్’ అని పిలిచే ఈ ఉప్పు నీటి సరస్సులకు టూరిస్టుల సందడి ఎక్కువే. ‘ఇన్‌స్టా’ క్రేజ్ వల్ల ఆ పాపులారిటీ రోజురోజుకీ బాగా పెరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News