Cobra vs Mongoose: నడిరోడ్డుపై పాము, ముంగిస పోరు.. గెలుపు దేనిదంటే..
ABN , Publish Date - Jul 18 , 2025 | 07:36 AM
Cobra vs Mongoose: ఎంత విషపూరితమైన పాములైనా ముంగిసలను తమ విషంతో చంపలేవు. ఎందుకంటే ముంగిస శరీరంలో విషాన్ని తట్టుకునే యాంటీ బాడీలు పుష్కలంగా ఉంటాయి. పాము కరిచిన తర్వాత కొంత సేపు మైకంలోకి వెళ్లి.. మళ్లీ సాధారణ స్థితిలోకి వస్తాయి.
పాము, ముంగిసలు బద్ధ శత్రువులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ రెండు ఎదురుపడితే యుద్ధం తప్పదు. ముంగిస పామును చంపి తినడానికి ప్రయత్నిస్తుంది. ఇక, పాము ప్రాణ భయంతో ముంగిస నుంచి తప్పించుకుని పారిపోవడానికి చూస్తుంది. ముంగిస వదిలి పెట్టదు. వెంటపడి కరుస్తుంది. ఈనేపథ్యంలోనే రెండిటి మధ్య భీకర పోరు నడుస్తుంది. ఎక్కువ శాతం ముంగిస దాడిలో పాములే చచ్చిపోతూ ఉంటాయి. అత్యంత అరుదుగా ముంగిసలు గాయాలపాలై చనిపోతూ ఉంటాయి.
రెండూ చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత విషపూరితమైన పాములైనా ముంగిసలను తమ విషంతో చంపలేవు. ఎందుకంటే ముంగిస శరీరంలో విషాన్ని తట్టుకునే యాంటీ బాడీలు పుష్కలంగా ఉంటాయి. పాము కరిచిన తర్వాత కొంత సేపు మైకంలోకి వెళ్లి.. మళ్లీ సాధారణ స్థితిలోకి వస్తాయి. ముంగిసలు చాలా తెలివైనవి పాముల్ని ఇట్టే పట్టేస్తాయి. ముక్కలు ముక్కలు చేసుకుని తినేస్తాయి. తాజాగా, ఓ ముంగిస పాముకు చుక్కలు చూపించింది. ఒక్కటే దెబ్బకు నోట కరుచుకుని పోయింది.
ఉత్తర ప్రదేశ్, ఓరేయా ప్రాంతంలో ఓ పాము, ముంగిస గొడవపడ్డాయి. గొడవ పడుతూ అలా రోడ్డు మీదకు వచ్చాయి. వాహనాలు, మనుషుల్ని చూడగానే ముంగిస పొదల్లోంచి బయటకు రాలేదు. పాము మాత్రం ముంగిస నుంచి తప్పించుకోవడానికి చాలా సేపు రోడ్డుపైనే ఉండిపోయింది. రోడ్డుపై పాము ఉండటాన్ని చూసి వాహనదారులు తమ వాహనాల్ని వాటికి దూరంగా ఆపేశారు. వీడియోలు తీయటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే పొదల్లో ముంగిస పామును పట్టుకోవడానికి బయటకు వచ్చింది. పాముపై దాడి చేసి నోట కరుచుకుపోయింది.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదం.. సీనియర్ పైలట్‌దే తప్పా?