Share News

Meta: మెటా కీలక ప్రకటన..

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:19 PM

ఫేస్ బుక్‌‌‌ను నిర్వహిస్తున్న మెటా సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫేస్ బుక్ సేవల్లోకి నూతనంగా డేటింగ్ ఫీచర్స్ తీసుకు వచ్చినట్లు తెలిపింది.

Meta: మెటా కీలక ప్రకటన..

ఫేస్ బుక్‌‌‌ను నిర్వహిస్తున్న మెటా సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫేస్ బుక్ సేవల్లోకి నూతనంగా డేటింగ్ ఫీచర్స్ తీసుకు వచ్చినట్లు తెలిపింది. అర్థవంతమైన సంబంధాలను సులువుగా గుర్తించేందుకు ఇది సహాయ పడుతుందని అభిప్రాయపడింది. వీటికి డేటింగ్ అసిస్టెంట్స్, క్యూట్ మీట్ అని పేర్లు పెట్టినట్లు వివరించింది. దీనిని కృత్రిమ మేథ ద్వారా తీసుకు వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ రోజు నూతనంగా డేటింగ్ అసిస్టెంట్, మీట్ క్యూట్ అనే రెండు కొత్త ఫేస్ బుక్ డేటింగ్ ఫీచర్లు పరిచయం చేస్తున్నామని వెల్లడించింది. మీరు.. వద్దనుకున్న వారితో కాకుండా.. డేటింగ్ కావాలనుకుంటున్న వ్యక్తులతో సంబంధాలు పెంచుకునేందుకు ఇవి సహాయ పడతాయని అభిప్రాయ పడింది.


ఈ మేరకు ఆ సంస్థ.. తన బ్లాగ్ స్పాట్ ద్వారా వివరించింది. ఆ క్రమంలో డేటింగ్ అసిస్టెంట్, మీట్ క్యూట్ ఎలా పని చేయనున్నాయో ఈ సందర్భంగా వివరించింది. ఇక ఇవి తొలుత అమెరికా, కెనడాల్లో ట్యాబ్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇక నూతన డేటింగ్ అసిస్టెంట్ ద్వారా.. డేటింగ్ సూచించడం, వినియోగదారుల ప్రొఫైల్‌లను మెరుగు పరచడంలో సహాయపడుతుందని వివరించింది. మరోవైపు మీట్ క్యూట్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని మీటా అల్గారిథమ్ ఆధారంగా రూపొందించింది. తొలుత వారానికి ఒక సారి మ్యాచ్‌లు వస్తాయని.. ఆ తర్వాత.. అవి తరచుగా వస్తాయని వివరించింది.


అలాగే ఎవరితో చాట్ చేయవచ్చు.. ఎవరితో వద్దు అనేది అప్పటికప్పుడు ఇది నిర్ధారిస్తోందని వివరించింది. కొత్తగా తీసుకు వచ్చిన ఈ ఫీచర్స్ వల్ల ఫేస్ బుక్ డేటింగ్‌కు కొనసాగించ వచ్చు లేదు అనే అంశంలో ప్రజలకు ఇది సహాయ పడనుంది. అదీకాక ప్రజలు.. సులువుగా, స్వేచ్ఛగా ప్రజలతో కలిసేందుకు ఈ ఫేస్ బుక్ డేటింగ్ ఉప యోగపడనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏదో తేడా కొడుతుంది.? జగన్ కు బొత్స భయం

దేవీ నవరాత్రులు.. డ్రెస్‌ కోడ్‌తో కూటమి మహిళా నేతలు

For More prathyekam News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 03:48 PM