Woman Viral Video: ఆంటీకి, అమ్మాయికి మధ్య వింత పోటీ.. చివరకు ఏమైందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Apr 03 , 2025 | 10:57 AM
ఓ ఆంటీకి, అమ్మాయికి వింత పరీక్ష పెడతారు. ట్రాక్టర్ పెద్ద టైరును నేలపై పడేసి, దానిపై సుత్తితో ఎవరు గట్టిగా కొడతారనేది పరీక్ష. ఈ పోటీలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రస్తుత యువత పిజ్జాలు, బర్గర్లు తదితర ఫాస్ట్‌ఫుడ్ తింటూ పల్లెటూర్లలో లభించే సహజ సిద్ధమైన ఆహారాన్ని దూరం పెడుతున్నారు. నాలుక మీద రుచినే చూస్తున్నారు గానీ.. దాని వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను గుర్తించడం లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆంటీకి, అమ్మాయికి మధ్య జరిగిన ఓ ఫన్నీ పోటీ చూసి అంతా పిజ్జా, జొన్నరొట్టెను గుర్తు చేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆంటీకి, అమ్మాయికి (Competition between aunty and young woman) వింత పరీక్ష పెడతారు. ట్రాక్టర్ పెద్ద టైరును నేలపై పడేసి, దానిపై సుత్తితో ఎవరు గట్టిగా కొడతారనేది పరీక్ష. ముందుగా సుత్తితో అక్కడికి వచ్చిన యువతి.. దాన్ని గాల్లోకి లేపి కొట్టబోయింది. అయితే సుత్తిని గాల్లొకి లేపగానే దాని బరువును నియంత్రింలేక కిందపడేసింది.
కనీసం సుత్తిని కూడా ఎత్తలేక చివరకు పోటీ నుంచి నిష్ర్కమించింది. అయితే తర్వాత అక్కడికి వచ్చిన ఆంటీ.. సుత్తిని ఎంతో సులభంగా పైకి ఎత్తడమే కాకుండా టైరును వీరబాదుడు బాదేసింది. ఇలా చూస్తుండగానే సుత్తితో అనేక సార్తు టైరును బాదేసి, తన సత్తా నిరూపించుకుంది. ఈ ఆసక్తికర పోటీని చూసిన వారంతా.. ఆంటీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది కదా జొన్న రొట్టె పవర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టండి చూద్దాం..
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జొన్నరొట్టెకు.. పిజ్జాకు జరిగిన పోరాటంలో రొట్టె విజయం సాధించింది’’.. అంటూ కొందరు, ‘‘ఆంటీ బలం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Dog Viral Video: కుక్కతో రైలెక్కాలని చూస్తే.. ఇలా జరిగిందేంటీ.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..