Share News

Amitabh Veganism: కేబీసీలో బిగ్ బీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరు నా కళ్లు తెరిపించారంటూ కంటెస్టెంట్‌పై ప్రశంస

ABN , Publish Date - Nov 16 , 2025 | 09:07 PM

వీగనిజం ఫాలో అవుతానన్న ఓ కంటెస్టెంట్ మాటలను విని కేబీసీ షో వ్యాఖ్యాత ఒకింత ఆశ్చర్యపోయారు. మీరు నా కళ్లు తెరిపించారని కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Amitabh Veganism: కేబీసీలో బిగ్ బీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరు నా కళ్లు తెరిపించారంటూ కంటెస్టెంట్‌పై ప్రశంస
Amitabh Bachchan KBC

ఇంటర్నెట్ డెస్క్: కౌన్‌ బనేగా కరోడ్‌‌పతీ టీవీ షోకు హాజరైన కంటెస్టెంట్‌తో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు నా కళ్లు తెరిపించారని సదరు కంటెస్టెంట్‌ను అభినందించారు. శాకాహారంపై చర్చ సందర్భంగా ఇలా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Big B KBC - Vegan Contestant).

సిద్ధార్థ శర్మ అనే కంటెస్టెంట్‌తో బిగ్‌ బీ శాకాహారం గురించి మాట్లాడారు. తాను దాదాపు ఏడు సంవత్సరాలుగా వీగనిజమ్‌ను పాటిస్తున్నానని సిద్ధార్థ చెప్పడంతో బిగ్ బీ ఆశ్చర్యపోయారు. ఈ జీవనశైలిని అనుసరించే వారు పాలు, పెరుగు, కోడి గుడ్లు సహా ఏఒక్క జంతు సంబంధిత ఉత్పత్తిని వినియోగించరు. ఫలితంగా సిద్ధార్థ తీరుపై బిగ్ బీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘మీరు జంతు ఉత్పత్తులు ఏవీ వాడరా?’ అని ప్రశ్నించారు.


దీనికి సిద్ధార్థ స్పందిస్తూ.. ‘మనం ఎలాగైతే జీవించాలని అనుకుంటున్నామో జంతువులు కూడా అలాగే భావిస్తాయి. కాబట్టి నేను జంతు ఉత్పత్తులను వాడను. ఉదాహరణకు పాలు అనేవి దూడకు మాత్రమే. ఏ జీవీ తన జీవితాంతం పాలిస్తూ ఉండదు. కాబట్టి కృత్రిమ పద్ధతుల్లో అవి గర్భం దాల్చేలా చేస్తారు. ఇది నా దృష్టిలో అనైతికం’ అని వివరించారు. దీంతో, బిగ్ బీ మరింత ఆశ్చర్యపోయారు. ‘ఇది వింటుంటే బాధగా ఉంది. మీరు నాకు కళ్లు తెరిపించారు’ అని కామెంట్ చేశారు.

అమితాబ్ ఆరోగ్య కారణాల రీత్యా గత రెండు దశాబ్దాలుగా శాకాహారాన్నే తింటున్నారు. ఆయన ఒక గ్లాసు పాలు, కోడి గుడ్లు, కొద్దిగా అన్నం వంటివి మాత్రమే తింటారని 2019లో ఆయన షెఫ్ ఒకసారి తెలిపారు. రాత్రి సమయంలో కేవలం సూప్స్‌తోనే సరిపెట్టుకుంటారని అన్నారు. స్వీట్లు, అన్నం, నాన్ వెజ్ ఫుడ్స్, టీ, కాఫీ, మద్యం, చివరకు కూల్ డ్రింక్స్ వంటి వాటికి కూడా అమితాబ్ దూరంగా ఉంటారని జాతీయ మీడియాలో పలు సందర్భాల్లో కథనాలు వెలువడ్డాయి.


ఇవీ చదవండి:

ఏసీ కోచ్‌లో జర్నీ.. రాత్రంతా గాఢ నిద్ర.. తెల్లారి లేచే సరికి..

వందేభారత్ స్లీపర్.. గాస్లు నిండా నీరు.. చుక్క నీరు కూడా ఒలకలేదుగా!

Read Latest and Viral News

Updated Date - Nov 16 , 2025 | 09:58 PM