Employee makes AI Fake Visual: ఏఐ జనరేటెడ్ ఫేక్ విజువల్‌తో ఉద్యోగి లీవ్ అప్లై.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:59 PM
ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగి లీవ్ కోసం వింత ప్రయత్నమే చేశాడు. తాను బైక్‌పై నుంచి కింద పడినట్టు, చేతికి గాయమైనట్టు హెచ్ఆర్‌కు పిక్ పంపాడు. అయితే.. చివరకు ఏఐ జనరేటెడ్ ఫేక్ విజువల్ అని తేలింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఉద్యోగులు సెలవు తీసుకునేందుకు రకరకాల కారణాలు చెబుతుంటారు. వీటిలో నిజాలుంటాయ్.. కొన్ని సందర్భాల్లో అబద్ధాలూ ఉంటాయ్. అయితే.. వీటికి భిన్నంగా తాజాగా ఓ ఉద్యోగి వింత పని చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఉద్యోగి ఏం చేశాడు? ఆ కంపెనీ ఏం చేసిందో తెలుసుకోండి.
సెలవు తీసుకునే పనిలో భాగంగా.. తను బైక్‌పై నుంచి కింద పడ్డానని చెబుతూ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉందని కంపెనీ హెచ్‌ఆర్‌కు మెసేజ్ పంపాడో ఉద్యోగి. అలాగే తన చేతికి గాయమైనట్టు చూపించే ఓ ఫొటోనూ పంపాడు. హెచ్ఆర్.. ఈ విషయాన్ని వెంటనే మేనేజర్‌కు చెప్పారు. దీంతో ఆ ఉద్యోగికి వేతనంతో కూడిన సెలవు మంజూరైంది. అయితే.. ఆ ఉద్యోగి చేతికి ఎలాంటి గాయం కాలేదని, కనీసం దాని ఆనవాళ్లూ కూడా లేవని తేలింది. అతను కేవలం సెలవు తీస్కోవడం కోసమే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ఉపయోగించి ఈ ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేశాడని కంపెనీ పేర్కొంది. దీనికోసం జెమిని నానో టెక్నాలజీని ఉపయోగించినట్టు స్పష్టం చేసింది.
సదరు కంపెనీ గొరిల్లా ట్రెండ్ అండ్ టెక్నాలజీస్ కాగా.. ఆ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రేయాస్ నిర్మల్ ఈ సంఘటనను అంతా తన సోషల్ మీడియా లింక్డ్‌ఇన్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ ఉద్యోగి ఒరిజినల్ పిక్, హెచ్ఆర్‌కు పంపిన ఫేక్ ఇమేజ్ రెండింటినీ అందులో పంచుకున్నారు. అదిప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఏఐ పిక్ కూడా అచ్చం ఒరిజినల్‌లాగే ఉందని కొందరు, ఇలాంటి ఘటనలు వేరే ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని మరికొందరు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవీ చదవండి: