Elon Musk Net Worth: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ కొత్త రికార్డు
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:58 PM
ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ కొత్త రికార్డు సృష్టించారు. 2020లో 24 బిలియన్లు, 2024లో 400 బిలియన్లు, అక్టోబర్ 2025లో 500 బిలియన్లు.. ఇప్పుడు 600 బిలియన్లకు పైగా! ఇదీ.. అతని సంపద పెరిగిన తీరు. రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 16: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. డిసెంబర్ 15, 2025 నాటి ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, మస్క్ సంపద 600 బిలియన్ డాలర్లు (సుమారు 677 బిలియన్ డాలర్లు) దాటింది. ఇది ప్రపంచ చరిత్రలో ఎవరూ చేరని మైలురాయి.

600 బిలియన్లకు పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఆయన సంపద భారీగా పెరుగుదలకు ప్రధాన కారణం ఆయన స్థాపించిన స్పేస్‌ఎక్స్ కంపెనీ వాల్యుయేషన్. ఇటీవలి ఇన్‌సైడర్ షేర్ సేల్‌లో స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్లుకు చేరింది. మస్క్ దీనిలో సుమారు 42% వాటా కలిగి ఉన్నారు. దీని వల్ల ఆయన సంపదకు ఒక్కరోజులోనే 168 బిలియన్ డాలర్లు జోడయ్యాయి.

స్పేస్‌ఎక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. ఈ సంస్థ 2026లో IPOకు సన్నాహాలు చేస్తోంది.టెస్లా, ఎక్స్‌ఏఐ (xAI) వంటి ఇతర కంపెనీలు కూడా మస్క్ సంపదకు మద్దతు ఇస్తున్నాయి. నవంబర్‌లో టెస్లా షేర్‌హోల్డర్లు ఆయనకు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన కొత్త పే ప్యాకేజీని ఆమోదించారు. ఇది ఆయనను త్వరలోనే మొదటి ట్రిలియనైర్‌గా మార్చే అవకాశం ఉంది.
ఎలాన్ మస్క్ సంపద సృష్టి ఒక అద్భుతం
2020లో 24 బిలియన్లు, 2024లో 400 బిలియన్లు, అక్టోబర్ 2025లో 500 బిలియన్లు – ఇప్పుడు 600 బిలియన్లకు పైగా! రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై ఆయన అంచనాల ఫలితమే ఈ విజయం. ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ధనవంతుని(మార్క్ జుకర్‌బర్గ్)తో పోల్చితే మస్క్ సంపద దాదాపు 400 బిలియన్లు అధికంగా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి...
భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన
సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News