Forcing a Kiss On YouTuber: లేడీ యూట్యూబర్‌పై రెచ్చిపోయిన యువకుడు.. ముద్దు కోసం ఏకంగా..
ABN , Publish Date - Dec 26 , 2025 | 03:35 PM
చైనా పర్యటనకు వెళ్లిన ఓ రష్యా లేడీ యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. ముద్దు కోసం బాగా ఇబ్బంది పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పట్ట పగలు అందరూ చూస్తుండగా ఓ యువకుడు రెచ్చిపోయాడు. లేడీ యూట్యూబర్‌తో ముద్దు కోసం దారుణానికి ఒడిగట్టాడు. ముద్దు కోసం ఆ యూట్యూబర్‌ను వేధింపులకు గురి చేశాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ లేడీ యూట్యూబర్ చైనా పర్యటనకు వెళ్లింది. చైనాలో పర్యటిస్తున్న సమయంలో ఓ హోటల్‌కు వెళ్లింది. ఓ టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ తాగుతూ తనను తాను వీడియో తీసుకుంటూ ఉంది. ఈ సమయంలో ఆమె దగ్గరకు ఓ యువకుడు వచ్చాడు. ఆమెతో మాటలు కలిపాడు. ఆమె దగ్గరకు రాసాగాడు. ఆమె దూరంగా జరిగి ‘ఎవరు నువ్వు’ అని అడిగింది.
తన పేరు ‘మహ్మద్’ అని, ఈజిప్ట్ నుంచి వచ్చానని అతడు చెప్పాడు. ఆమెను ముద్దు కోసం బలవంతం చేశాడు. ఆమె ఇబ్బందిపడుతున్నా సరే అతడు మాత్రం ఆమెను బలవంతం చేశాడు. ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ లేడీ యూట్యూబర్ అతి కష్టం మీద పక్కకు తప్పుకుంది. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
‘పట్ట పగలు అందరూ చూస్తుండగా అమ్మాయిపై ఇంత దారుణానికి ఒడిగతాడా? అతడ్ని అస్సలు వదలి పెట్టకూడదు’..‘అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి. లేదంటే తర్వాతి కాలంలో చాలా దారుణాలకు పాల్పడతాడు. ప్లీజ్ అరెస్ట్ చేయండి’.. ‘అందరూ ఉన్నపుడే అంతలా వేధించాడంటే.. ఒంటరి అమ్మాయిలను ఇంకేం చేస్తాడో ఆ దేవుడికే తెలియాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆ యువకుడిపై ఆ లేడీ యూట్యూబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందా? లేదా? తర్వాత ఏం జరిగింది? అన్నది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి
రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా: కేటీఆర్