Share News

తినే బొకేలు... ఓకే

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:59 PM

ఎవరికైనా స్వాగతం పలకడానికో, లేదంటే శుభాకాంక్షలు తెలపడానికో అందంగా పేర్చిన పూలబొకేను తీసుకెళ్లడం మామూలే. పూల బొకే అందిస్తూ ఫొటో దిగితే ఆ కార్యక్రమం పూర్తయినట్టు. అయితే ఖరీదైన ఆ పూల బొకే కొన్ని గంటల్లో చెత్త బుట్టలోకి చేరిపోతుంది.

తినే బొకేలు... ఓకే

ఎవరికైనా స్వాగతం పలకడానికో, లేదంటే శుభాకాంక్షలు తెలపడానికో అందంగా పేర్చిన పూలబొకేను తీసుకెళ్లడం మామూలే. పూల బొకే అందిస్తూ ఫొటో దిగితే ఆ కార్యక్రమం పూర్తయినట్టు. అయితే ఖరీదైన ఆ పూల బొకే కొన్ని గంటల్లో చెత్త బుట్టలోకి చేరిపోతుంది. అదే నోరూరించే ‘కేక్‌ బొకే’ అయితే... అలాంటి రోజులు మనదగ్గర కూడా రాబోతున్నాయి.

ఎవరైనా సరే పూలను అమితంగా ఇష్టపడతారు. మిఠాయిలను కూడా ఆనంద సమయాల్లో పంచుకుంటారు. ఈ రెండింటినీ ఎందుకు కలపకూడదు? ఇదే ఆలోచన సిడ్నీకి చెందిన మాసీ నెమర్‌కు వచ్చింది. ఆమెకి ఫుడ్‌ అండ్‌ ఆర్ట్‌ పట్ల ఆసక్తి ఎక్కువ. బోలెడు డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన పూలబొకేలు సాయంత్రం అయ్యేసరికి చెత్తబుట్టలోకి చేరడం మాసీకి అస్సలు నచ్చలేదు. అలా పడేసే పూలబొకేల స్థానంలో... తినేవి ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఆసక్తే ‘కప్‌కేక్‌ బొకే’ తయారీవైపు ఆమెను నడిపించింది.


book10.2.gif

ఆకర్షణీయమైన పూల డిజైన్లతో...

మాసీకి బేకింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. అయినప్పటికీ తనకు వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలనుకుంది. ఆ ఆసక్తితోనే కప్‌కేక్‌ బొకే వ్యాపారాన్ని ప్రారంభించారు.

కప్‌కేక్‌ అనుకున్న విధంగా తయారుచేసేందుకు రోజూ గంటల కొద్దీ శ్రమించారు. కొంతకాలానికి పూల డిజైన్ల తయారీలో ప్రావీణ్యం సంపాదించారామె. ఆ తరువాత తినే బొకేలను తయారుచేయడంపై దృష్టి పెట్టారు. ఆమె శ్రమ వృథా కాలేదు. అతిథులను ఆకట్టుకునేలా పూల బొకేని మించి ఉండేలా ‘కప్‌కేక్‌ బొకే’లను ఆకర్షణీయంగా తయారుచేశారు. ‘‘రకరకాల కప్‌కేక్‌ రెసిపీలు తయారుచేసేందుకు గంటల కొద్దీ పరిశోధన, ప్రయోగాలు చేశాను. ఫ్రాస్టింగ్‌ పద్ధతులు, అలంకరణపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాను’’ అని తన అనుభవాన్ని పంచుకుంటారు మాసీ నెమర్‌.


‘బేక్డ్‌ బొకే’ పేరుతో మాసీ ఒక సంస్థను ప్రారంభించారు. ఆ స్టోర్‌కి వచ్చిన వినియోగదారులు తినే బొకే ఆలోచన సూపర్బ్‌గా ఉందన్నారు. ‘అంత డబ్బు పెట్టి పడేసే పూల బొకే కొనడం కన్నా, తినే బొకే ఇవ్వడం మంచిది కదా’ అంటున్నారు ఆమె కస్టమర్లు. రానున్న కాలంలో పూల బొకేల స్థానంలో మనదగ్గర కూడా ‘కప్‌కేక్‌ బొకే’లు స్వాగతం పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


ఈ వార్తలు కూడా చదవండి.

సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 13 , 2025 | 12:59 PM