Share News

Earthquake: భూకంపం వస్తే ఏమి చేయాలి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు..

ABN , Publish Date - May 05 , 2025 | 08:45 PM

Earthquake Survival Tips: రెప్పపాటులోనే కాళ్ల కింద భూమి కంపించడం మొదలవుతుంది. ఉన్న చోటుతో పాటు చుట్టూ ఉన్న భవనాలు, ఇళ్లూ పక్కకు ఒరిగిపోయి బీటలు వారుతుంటాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారిగా షాక్ కు గురైన ప్రజల్లో కలిగే సహజ స్పందన భయంతో పరుగెత్తడం. కానీ, భూకంపం వచ్చినప్పుడు ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలో మీకు తెలుసా..

Earthquake: భూకంపం వస్తే ఏమి చేయాలి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు..
Earthquake Survival Tips

Earthquake Survival Tips: ఆఫీసులోనో లేదా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం. సడన్ గా చుట్టూ ఏదో అలజడి. ఇంట్లోని వస్తువులు దభీ దభీమని కిందపడిపోతుంటాయి. గోడలు నెర్రలు వచ్చేస్తుంటాయి. కాళ్ల కింద భూమి కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఉన్న చోటు పక్కకు ఒరిగిపోవచ్చు. భూకంపం (Earthquake) తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద బిల్డింగులు కూలిపోవచ్చు. ఇదంతా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో ప్రజల్లో సహజంగా కలిగే స్పందన భయం. ఇక ఆ వెంటనే ఉన్న చోటు నుంచి బయటికి పరుగులు తీస్తారు. ఇంతకీ, భూకంపం వచ్చినపుడు ప్రాణాలతో ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో లేదా బయట ఉన్నప్పుడు ఎలా స్పందించాలి? భూకంపం తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం.


ఇల్లు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు ఏం చేయాలి?

  • భూమి కంపించగానే భయపడకండి. తొందరపడి బయటికి పరుగెత్తకుండా ప్రశాంతంగా ఉండండి.

  • "డక్, కవర్ అండ్ హోల్డ్" పాటించండి. అంటే టేబుల్ లేదా బెంచ్ వంటివి ఉంటే వాటి కిందకు వెళ్లి దాక్కోండి. ఆ వస్తువును గట్టిగా పట్టుకోండి.

  • భూకంపం వచ్చినప్పుడు కిటికీలు, అద్దాలు, అల్మారాలు విరిగే ప్రమాదముంటుంది. కాబట్టి దూరంగా ఉండండి.

  • షాక్ లేదా పేలుళ్లు వచ్చే జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ స్విచ్‌లు, గ్యాస్ స్టవ్‌లను తాగవద్దు.

  • భూకంపం వచ్చినప్పుడు వేగంగా బయటికి వెళ్లాలని లిఫ్ట్ వాడకండి. బదులుగా మెట్ల మార్గాన్ని ఉపయోగించండి. (భూకంపం ఆగిన తర్వాత మాత్రమే).


బయట ఉన్నప్పుడు ఏం చేయాలి?

  • బిల్డింగ్‌లు, చెట్లు, విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి.

  • ఓపెన్ స్థలంలో ఉండేందుకు ప్రయత్నించండి.

  • వాహనాలు నడపడం మానేయండి. అలాగే వాహనాన్ని ఓ సురక్షిత ప్రదేశంలో ఆపండి.


భూకంపం తర్వాత

  • భూకంపం వచ్చి వెళ్లిన వెంటనే గ్యాస్, పవర్, వాటర్ లైన్స్‌ను ఆఫ్ చేయండి.

  • ఇతరులకు సహాయం చేయండి. పాములు, చీలిన చోట్లు, కింద పడిన వస్తువులు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

  • రేడియో/మొబైల్ ద్వారా అధికారులకు సమాచారం వినండి.

  • అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లండి.


Read Also: Optical Illusion Test: మీది హెచ్‌డీ చూపు అయితేనే.. ఈ ఏనుగుల మధ్యనున్న పాండాను 7 సెకెన్లలో కనిపెట్టండి

Snake Control Tips: పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..

Sparrow Viral Video: మచ్చుకైనా లేని మానవత్వానికి కనువిప్పు.. ఈ పిచ్చుక చేసిన పని చూస్తే..

Updated Date - May 05 , 2025 | 08:46 PM