Business Idea : పెట్టుబడి పెట్టిన రోజే డబుల్ ప్రాఫిట్.. ఇంట్లోనే చేసుకునే బెస్ట్ బిజినెస్ ఇదే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:04 PM
వేరే ఊర్లకు వెళ్లి ఏదొక పని చేయాలని ఇంట్రెస్ట్ లేదా.. ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో సొంత కాళ్లపై నిలబడే బిజినెస్ ఐడియా కోసం వెతికేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం పెద్ద చదువులు చదవాల్సిన పనిలేదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టనవసరం లేదు. మీ శ్రమకు కాస్త మార్కెటింగ్ స్కిల్స్ జోడిస్తే చాలు. కచ్చితంగా ఏడాదంతా లాభాలు పొందవచ్చు.
మనలో చాలామందికి జీవితంలో మంచి వ్యాపారవేత్త అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. జాబ్ దొరక్క సిటీలు, ఇళ్ల వద్ద ఉండేవాళ్లయినా, ఇది వరకే ఉద్యోగం చేసే వాళ్లయినా ఏదైనా సొంతంగా బిజినెస్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటారు. పెద్ద పెట్టుబడులు పెట్టే స్థోమత లేక వ్యాపార ఆలోచనను వాయిదా వేసేవాళ్లకు ఇది బెస్ట్ ఐడియా. వేరే ఊర్లకు వెళ్లి ఏదొక జాబ్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితో సొంత కాళ్లపై నిలబడాలని కోరుకునేవారికి ఈ బిజినెస్ బస్ట్ ఆప్షన్. ఇందుకోసం పెద్ద చదువులు చదవాల్సిన పనిలేదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టనవసరం లేదు. మీ శ్రమకు కాస్త మార్కెటింగ్ స్కిల్స్ జోడిస్తే చాలు. కచ్చితంగా ఏడాదంతా లాభాలు పొందవచ్చు.
ఈ కారణం వల్లే ఈ బిజినెస్ ఐడియా బెస్ట్..
న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటే తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంపాదన కోసం భార్యా, భర్త ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లి తీరాల్సిందే. ఇంట్లో చేసుకుని తినాలనే కోరిక ఉన్నా తగినంత సమయం, ఓపిక ఉండవు. ఎందుకంటే, కూరగాయలు కడగటం, కట్ చేయడం సమయమంతా వీటికే పూర్తవుతుంది. తాజాగా తినాలనుకున్న ప్రతిసారీ మార్కెట్లో తెచ్చుకునేంత తీరిక ఉండదు. ఒకవేళ బయట తినాలన్నా రోజూ తింటే సంపాదన మొత్తం వాటికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. హోటళ్లో చేసే వంట శుచీ శుభ్రత, రుచి కోసం వాడే పదార్థాల విషయంలోనూ అనేక అనుమానాలు ఉండనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో అందరి ఇళ్లల్లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే తాజాగా కట్ చేసిన కూరగాయలను డెలివరీ చేసే వ్యాపారం రాన్రాను పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని సిటీల్లో ఈ తరహా వ్యాపారాలకు మంచి డిమాండ్ ఉంటోంది.
లక్షలోపు పెట్టుబడితో వెజిటబుల్ చాపింగ్ బిజినెస్..
ఒక చిన్నగది, శుభ్రం చేసుకునేందుకు తగినంత ఖాళీ స్థలం, కూరగాయల క్లీనింగ్, కటింగ్, ప్యాకింగ్ కోసం ఒక పనివాడు, వెజిటబుల్ కటింగ్ మెషీన్స్, డెలివరీ బాయ్, డీప్ ఫ్రీజర్, వెండింగ్ మెషీన్, బిల్లింగ్ మెషీన్.
పైన చెప్పిన వాటిలో సొంతంగా పనిచేసుకుంటాం, ఎక్కువ ఖర్చు చేయలేం అనుకునేవాళ్లు పనివాళ్లను మినహాయించి మిగతావి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాక పనివాళ్లను పెట్టి చేయించుకోవాలి అనుకున్నా పెట్టుబడి లక్ష రూపాయలకు మించి కాదు.
ఇలా మార్కెటింగ్ చేసుకోండి..
వెజిటబుల్ చాపింగ్ వ్యాపారంలో నెగ్గుకురావాలంటే మార్కెటింగ్ మెళకువలు తప్పక పాటించాల్సిందే.ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండకపోతే కూరగాయలు చెడిపోయి ఎందుకూ పనిరాకుండా పోతాయి. నష్టాలపాలు చేస్తాయి. అందుకే ముందుగానే కార్పొరేట్ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలకు వెళ్లి ఉద్యోగులతో డీలింగ్స్ కుదుర్చుకోండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తగినంత ప్రచారం చేసుకుంటే మంచిది. ఇలాగే పారామిత సేన్ గుప్తా అనే ఒక హైదరాబాదీ కట్ చేసిన ఫ్రెష్ కూరగాయలు డెలివరీ చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.
వీరికైతే పెట్టుబడి ఖర్చు తక్కువ..
సాధారణంగా పల్లెల నుంచి కూరగాయలు తెచ్చి సిటీలు, టౌన్లలో విక్రయిస్తుంటారు. అలాంటి వారు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రత్యేకంగా కూరగాయలు కొనుగోలు చేయాల్సిన పని ఉండదు. పెట్టుబడి ఖర్చు మరింత తగ్గి ఆదాయం పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి..