Dubai Star Hotel: ప్రపంచంలోనే అతి గొప్ప స్టార్ హోటల్.. ఒక్క రోజుకు ఎంత ఖర్చు పెట్టాలంటే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:00 PM
దుబాయ్‌లోని ఓ ద్వీపంలో నిర్మించిన ఈ హోటల్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సాటిలేని ఆతిథ్యం, అసాధారణ డిజైన్‌తో అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ టామ్ రైట్ రూపొందించిన బుర్జ్ అల్ అరబ్ నిర్మాణం 1999లో పూర్తయింది.

జుమేరా బుర్జ్ అల్ అరబ్ (Burj Al Arab).. దుబాయ్ (Dubai)లోని అత్యంత విలాసవంతమైన హోటల్. ప్రపంచంలోని ఒకే ఒక్క టెన్ స్టార్ హోటల్. నిజానికి అధికారికంగా ఇది 7-నక్షత్రాల హోటల్ (7-star hotel). కానీ, దుబాయ్‌లోని ఓ ద్వీపంలో నిర్మించిన ఈ హోటల్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సాటిలేని ఆతిథ్యం, అసాధారణ డిజైన్‌తో అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ టామ్ రైట్ రూపొందించిన బుర్జ్ అల్ అరబ్ నిర్మాణం 1999లో పూర్తయింది. అప్పట్నుంచి ఈ హోటల్‌లో బస చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీఐపీలు, సంపన్నులు క్యూ కడుతున్నారు.
హోటల్ లోపలి భాగంలో 24 క్యారెట్ల బంగారు ఆకులతో చేసిన అలంకరణలు, అద్భుతమైన షాన్డిలియర్లు, విలాసవంతమైన సూట్‌లు రెండు అంతస్తులలో ఉన్నాయి. హోటల్‌లో మొత్తం 202 డ్యూప్లెక్స్ సూట్‌లు ఉన్నాయి. బుర్జ్ అల్ అరబ్‌లో ఒక రాత్రి బస చేయడానికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. అలాగే ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే ఈ హోటల్‌లో గదులు దొరుకుతాయి. అతిథులను హోటల్ ఉన్న ఐలాండ్ వరకు హెలీకాఫ్టర్‌లో తీసుకువచ్చి, అక్కడి నుంచి రోల్స్ రాయిస్ కారు ఎక్కించి హోటల్‌కు తీసుకువెళ్తారు. అతిథులు ప్రైవేట్ బీచ్, ఇన్ఫినిటీ పూల్, గోల్డ్ ఫేషియల్స్, డైమండ్ మసాజ్‌ల వంటి చికిత్సలను అందించే స్పాతో సహా అనేక రకాల సౌకర్యాలను ఆస్వాదించవచ్చు.
ఆ హోటల్‌లో ఒక్క అతిథికి 8 మంది సిబ్బందిని కేటాయిస్తారు. అంతేకాదు జిమ్ చేయాలనుకునే వారి కోసం వ్యక్తిగత ట్రయినర్‌ను కూడా కేటాయిస్తారు. హోటల్‌లో ఎనిమిది ప్రపంచ స్థాయి రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిలో స్థానిక ఆహారాల నుంచి అంతర్జాతీయ వంటకాల వరకు ఆస్వాదించవచ్చు. హోటల్‌లో నీటి అడుగున నిర్మించిన రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ అతిథులు పెద్ద అక్వేరియం కిటికీ ద్వారా సముద్ర జీవులను చూస్తూ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
ఇవి కూడా చదవండి..
Tooth sticks in Kumbh Mela: ప్రేయసి ఐడియా అదిరిందిగా.. కుంభమేళాలో వేప పుల్లలు.. వేలల్లో సంపాదన..
Viral Video: అంకుల్ చెప్పింది వినాలిగా ఆంటీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..
Optical Illusion: ఈ మనుషుల మధ్యన పిల్లిని కనిపెడితే.. మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మాల్సిందే..
Strange Job: ఓర్నీ.. ఇలా కూడా కోట్లు సంపాదించవచ్చా? ఈ వ్యక్తి జాబ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి