Woman Fires Gunshots: వామ్మో.. పాటలు వింటే ప్రాణం తీసేస్తావా?
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:50 PM
తాగిన మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటూ ఉన్నారని దారుణానికి పాల్పడింది. గన్నుతో కాల్పులకు తెగబడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మనకు నచ్చని పని ఎవరైనా చేస్తే ఒకటికి రెండు సార్లు మాటలతో చెబుతాం. వినకపోతే చేతల వరకు వెళతాం. ఒక వేళ ఆవేశంలో ఏదైనా చేస్తే వారితో పాటు మనం కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇందుకు ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. పక్కింటి వాళ్లు సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటున్నారని ఓ యువతి ఆగ్రహానికి గురైంది. తాగిన మత్తులో వారి ఇంటిపై గన్నుతో కాల్పులు జరిపింది. అదృష్టం బాగుండి పక్కింటి వారు బుల్లెట్ల నుంచి తప్పించుకున్నారు. లేదంటే దారుణం జరిగి ఉండేది.
ఈ సంఘటన రష్యాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ యువతి ఫుల్లుగా తాగి ఇంటిలో నిద్రపోతూ ఉంది. ఈ నేపథ్యంలో పొరిగింటి వాళ్లు సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటూ ఉన్నారు. దీంతో ఆ యువతి నిద్ర భంగం అయింది. నిద్ర చెడిపోవటంతో యువతి ఆగ్రహానికి గురైంది. పొరిగింటి వాళ్ల మీద కోపంతో గన్ను బయటకు తీసింది. కిటికి లోంచి పొరిగింటిపై కాల్పులు జరిపింది. ఆమె తాగి ఉండంతో గురి తప్పింది. పొరిగింటి గోడకు బుల్లెట్లు తగిలాయి.
ఈ సంఘటన రష్యాలో ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. గన్నుతో కాల్పులకు తెగబడ్డ ఆమెపై పోలీసు కేసు నమోదు అయిందా లేదా అన్నది కూడా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మరీ ఇంత కోసం అయితే ఎలా మేడమ్.. జైల్లో చిప్పకూడు తినాలని ఉందా?’.. ‘పొరిగింట్లో ఉన్న వాళ్లు పుణ్యం చేసుకున్నారు. లేదంటే వాళ్ల ప్రాణాలు పోయేవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చేపలు పడుతుండగా షాకింగ్ సీన్.. నోటి లోపలి నుంచి మొసలి వచ్చి..
ఫొటో కంటే ప్రాణం ముఖ్యం.. ఈ యువతికి ఏమైందో చూడండి..