Share News

Crocodile catches fish: చేపలు పడుతుండగా షాకింగ్ సీన్.. నోటి లోపలి నుంచి మొసలి వచ్చి..

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:33 PM

అత్యంత బలమైన ఏనుగు కూడా నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చేపలు పట్టడానికి వెళితే మొసలి వచ్చి షాకిచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Crocodile catches fish: చేపలు పడుతుండగా షాకింగ్ సీన్.. నోటి లోపలి నుంచి మొసలి వచ్చి..
crocodile catches fish video

నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అత్యంత బలమైన ఏనుగు కూడా నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చేపలు పట్టడానికి వెళితే మొసలి వచ్చి షాకిచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (crocodile viral video).


@AMAZlNGNATURE అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి చేపలు పట్టడానికి పడవ వేసుకుని నది మధ్యలోకి వెళ్లాడు. అక్కడ అతడి వలకు ఓ పెద్ద చేప చిక్కింది. ఆ చేపను పట్టుకుని పైకి తీయడానికి ప్రయత్నిస్తుండగా అక్కడకు హఠాత్తుగా నీటి అడుగు నుంచి ఓ మొసలి వచ్చింది. ఆ చేపను పట్టుకుని లాక్కెళ్లిపోయింది. ఆ వ్యక్తి వెంటనే ఆ చేపను వదిలేసి తనను తాను రక్షించుకున్నాడు (crocodile hunting fish).


ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (crocodile attack video). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.3 లక్షల మందికి పైగా వీక్షించారు. నాలుగు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అతడు చాలా అదృష్టవంతుడని, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఒకరు కామెంట్ చేశారు. ఆ మొసలి చేపతో సరిపెట్టుకోడంతో అతడి బతికిపోయాడని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇది రైలా లేక మిసైలా.. గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు గురించి తెలుసా..


వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..

Updated Date - Dec 28 , 2025 | 06:33 PM