Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తే పోషకాలు తగ్గిపోతాయా..
ABN , Publish Date - Feb 15 , 2025 | 02:05 PM
ఓపెన్ కుకింగ్ కంటే ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తే పోషకాలు తగ్గిపోతాయని చాలా మంది అనుకుంటారు. అయితే, దీనిలో నిజమెంత? ప్రెజర్ కుక్కర్‌లో వంట చేయడం మంచిది కాదా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రెషర్ కుక్కర్ అనేది వంటగదిలో మనకు అత్యంత విలువైన వస్తువులలో ఒకటి. మనం దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఎందుకంటే ఇది నిమిషాల్లో మనకు ఇష్టమైన వంటకాలను తయారు చేయడంలో సహాయపడుతూ చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే, ప్రెజర్ కుక్కర్‌లో ఆహారం వండటం వల్ల పోషకాలు నాశనం అవుతాయని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇది ఎంత వరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాలు తగ్గిపోవు..
ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల పోషకాలు తగ్గిపోవు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్‌కు మూసివున్న మూత ఉంటుంది. నీరు లోపల మరిగి ఆవిరిగా మారుతుంది కానీ కుక్కర్ నుండి ఏవీ బయటకు రావు. ఇది ఎక్కువ నీరు ఆవిరైపోకుండా నిరోధిస్తుంది. ఫలితంగా, ఆహారం చాలా వేగంగా ఉడుకుతుంది. అన్ని వంట పద్ధతులు కొన్ని పోషకాలను నాశనం చేస్తాయని, కానీ ప్రెజర్ కుకింగ్ మరింత సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, ఎటువంటి చింత లేకుండా మీ ప్రెజర్ కుక్కర్‌లో పప్పు, ఇతర వంటకాలను చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు తక్కువ ఉష్ణోగ్రతలు అవసరమయ్యేవని, వెన్న లేదా నూనె అవసరం లేనివని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్‌లో ఆవిరి పట్టడం, ఉడకబెట్టడం వంటకు మంచిదని, ఎలాంటి పోషక నష్టాన్ని కలిగించవని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read: మహా కుంభమేళాలో వ్లాగర్.. ఆ పని చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు..