China lighter removal: కండోమ్‌తో సర్జరీ.. అసలేం జరిగిందో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే..
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:29 PM
చైనాకు చెందిన డెంగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట కడుపునొప్పితో హాస్పిటల్‌కు వచ్చాడు. నిరంతరంగా కడుపు ఉబ్బరం, నొప్పి వస్తుండటంతో టెస్టుల కోసం ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు స్కానింగ్ చేసి అతని కడుపులో లోతుగా నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు.
చైనాలో డాక్టర్లు అద్భుతం చేశారు. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ కండోమ్‌ను ఉపయోగించి ఆపరేషన్ చేశారు. రోగిని భారీ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన డెంగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట కడుపునొప్పితో హాస్పిటల్‌కు వచ్చాడు. నిరంతరంగా కడుపు ఉబ్బరం, నొప్పి వస్తుండటంతో టెస్టుల కోసం ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు స్కానింగ్ చేసి అతని కడుపులో లోతుగా నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు (swallowed lighter 30 years ago).
డెంగ్ కడుపులోని నల్లటి లైటర్ ఒకటి ఉండిపోయినట్టు డాక్టర్లు గుర్తించారు. 30 ఏళ్ల క్రితం స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో ఓ పందెం కాశానని, ఆ పందెం ప్రకారం లైటర్ మింగేశానని డెంగ్ గుర్తు చేసుకున్నాడు. మద్యం మత్తు దిగిన తర్వాత డెంగ్‌కు తాను లైటర్ మింగినట్టు గుర్తుకు రాలేదు. కడుపు లోపల లైటర్ ఉన్నప్పటికీ అతడికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. చివరకు 30 ఏళ్ల తర్వాత నొప్పి మొదలైంది. మొదట ఫోర్సెప్స్‌తో ఆ లైటర్‌ను బయటకు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు (doctors use condom procedure).

కానీ కడుపు లోపల ఉన్న లైటర్ ఉపరితలం బాగా సెన్సిటివ్‌గా ఉండడంతో కండోమ్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు (bizarre medical case China). రోగి కడుపులోకి నోటి ద్వారా నెమ్మదిగా కండోమ్‌ను ప్రవేశపెట్టారు. చాలా జాగ్రత్తగా ఆ లైటర్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 20 నిమిషాలు పట్టింది. ఆ లైటర్ పొడవు దాదాపుగా 7 సెంటీమీటర్లు ఉందని, అది తుప్పు పట్టినట్టు ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ వెరైటీ సర్జరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
పెళ్లిలో ఇదేం పనిరా అయ్యా.. అతిథులు చిప్స్ కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి..
ఇది టెక్నాలజీ మాయ.. ఈ డివైజ్ మీ ఆకలిని పసిగట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..