Share News

Hungry sensor device: ఇది టెక్నాలజీ మాయ.. ఈ డివైజ్ మీ ఆకలిని పసిగట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది..

ABN , Publish Date - Nov 28 , 2025 | 03:32 PM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Hungry sensor device: ఇది టెక్నాలజీ మాయ.. ఈ డివైజ్ మీ ఆకలిని పసిగట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది..
AI food ordering system

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (viral jugaad).


మంగళూరుకు చెందిన ఒక యువకుడు సృష్టించిన నూతన పరికరం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. స్టార్టప్ వ్యవస్థాపకుడు సోహన్ ఎం. రాయ్ మీల్ ఆర్డరింగ్ మాడ్యూల్ అనే పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని బెల్ట్‌కు తగిలించుకోవాలి. ఇది కడుపు నుంచి వచ్చే శబ్దాలను గమనించి తదనుగుణంగా ఆన్‌లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తుంది. తన సోదరి స్టెతస్కోప్‌తో సహా వివిధ పదార్థాలను ఉపయోగించి ఈ డివైజ్‌ను తయారు చేసినట్టు సోహన్ తెలిపారు. ఈ పరికరాన్ని పరీక్షించడానికి తాను ఒక రోజంతా ఆకలితో ఉన్నానని చెప్పారు (automatic food ordering AI).


కంటెంట్ క్రియేటర్ అయిన సోహన్ చేస్తున్న వినూత్న ప్రయోగాలు ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి (tech innovation India). 'జికిగై' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో సోషల్ మీడియాలో టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను సోహన్ సృష్టిస్తారు. ఆయన చేసే ప్రయోగాలు కొంచెం వింతగా అనిపించినా, చాలా మంది యువతీయువకులను ఆకట్టుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి..

వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 28 , 2025 | 03:32 PM