Share News

Mind blowing trick: వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..

ABN , Publish Date - Nov 27 , 2025 | 03:08 PM

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Mind blowing trick: వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..
eternal flame trick

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Eternal flame trick).


sandeepsingh46958 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అఖండ జ్యోతి మండుతూ ఉండడం కోసం ఒక వ్యక్తి అద్భుతమైన ట్రిక్‌ను ఉపయోగించారు. ఒక వాటిర్ బాటిల్‌లో నూనె వేసి దానిని తలకిందులుగా కర్రకు కట్టారు. రోగులకు సెలైన్ పెట్టడానికి ఉపయోగించే డ్రిప్ పైప్‌ను ఆ బాటిల్ మూతకు బిగించారు. ఆ పైప్ మరో చివరను దీపం వెలిగించిన ప్రమిదపై పెట్టారు. ఆ బాటిల్ నుంచి వచ్చే నూనె ఆ పైప్ ద్వారా ఆ ప్రమిదలో చుక్కలుగా పడేలా అమర్చారు (clever hack).


అలా చేయడం వల్ల ఆ జ్యోతి ఎక్కువ సేపు వెలుగుతూ ఉంటుంది (man clever idea). ఆ ట్రిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. దాదాపు 3 వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ ట్రిక్ ఉపయోగించిన వ్యక్తి డాక్టర్ అయి ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. ఇది అద్భుతమైన ఉపాయం అని మరొకరు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2025 | 03:08 PM