wedding stampede: పెళ్లిలో ఇదేం పనిరా అయ్యా.. అతిథులు చిప్స్ కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి..
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:11 PM
పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియోలో పెళ్లికి హాజరైన అతిథులు చిప్స్ ప్యాకెట్ల కోసం కొట్టుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. తాజాగా మరో పెళ్లి వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఆ వీడియోలో పెళ్లికి హాజరైన అతిథులు చిప్స్ ప్యాకెట్ల కోసం కొట్టుకున్నారు. ఒకరినొకరు తోసుకుని నవ్వులపాలయ్యారు (chips and snacks rush).
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. ఓ సామూహిక వివాహ వేడుకకు వచ్చిన అతిథులు చిప్స్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. మాటర్ పనీర్, నాన్-వెజ్, గులాబ్ జామున్ కోసం పెళ్లిలో గొడవపడటం చూశాం. కానీ, ఈ సారి చిప్స్ ప్యాకెట్ల కోసం కూడా గొడవకు దిగారు. స్నాక్స్, చిప్స్ ప్యాకెట్లు ఉన్న బాక్స్‌లను లాక్కెళ్లిపోయారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దోపిడీలో వరుడు కూడా పాలుపంచుకున్నాడు. ఈ సామూహిక వివాహ పథకాన్ని హమీర్‌పూర్‌లోని రథి పట్టణంలో యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది (viral wedding video).
చిప్స్ ప్యాకెట్ల కోసం సాగిన ఈ ఫైటింగ్‌ను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (wedding chaos India). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 50 వేల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వీళ్లు పెళ్లికి వచ్చిన అతిథులా, వరద బాధితులా అని ఒకరు ప్రశ్నించారు. వారు తినడానికే పెళ్లికి వచ్చినట్టున్నారని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వావ్.. ఈ తెలివికి ఫిదా కావాల్సిందే.. అఖండ జ్యోతి కోసం ఉపయోగించిన ట్రిక్ చూస్తే..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ వంటగదిలో దాక్కున్న ఎలుకను 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..