Share News

Pressure cooker warning: మీరు వాడే కుక్కర్ పాతదా.. వెంటనే మార్చకపోతే పిల్లలకు ఈ ప్రమాదం తప్పదు..

ABN , Publish Date - Aug 27 , 2025 | 03:32 PM

భారతీయులు ఎక్కువగా ప్రెజర్ కుక్కర్‌ల సహాయంతోనే వంటలు చేస్తారు. అన్నం వండుకోవడం, కూరలు, పప్పులు ఉడికించడానికి కూడా కుక్కర్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కుక్కర్ లేని వంటింటిని ఊహించడం కష్టమనే చెప్పాలి. కుక్కర్‌ను ఎంత కాలం ఉపయోగించినా అది బలంగా, దృఢంగా ఉన్నట్టే కనిపిస్తుంది.

Pressure cooker warning: మీరు వాడే కుక్కర్ పాతదా.. వెంటనే మార్చకపోతే పిల్లలకు ఈ ప్రమాదం తప్పదు..
pressure cooker warning

భారతీయులు ఎక్కువగా ప్రెజర్ కుక్కర్‌ (Pressure cooker)ల సహాయంతోనే వంటలు చేస్తారు. అన్నం వండుకోవడం, కూరలు, పప్పులు ఉడికించడానికి కూడా కుక్కర్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కుక్కర్ లేని వంటింటిని ఊహించడం కష్టమనే చెప్పాలి. కుక్కర్‌ను ఎంత కాలం ఉపయోగించినా అది బలంగా, దృఢంగా ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే కుక్కర్‌లను ఎక్కువ కాలం ఉపయోగిస్తే పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదట (pressure cooker warning).


ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ అండ్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ మనన్ వోరా ఇటీవల కుక్కర్ వాడకం గురించి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా హెచ్చరించారు. పాత కుక్కర్‌ను ఎందుకు మార్చాల్సిన అవసరం ఉందో వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. ఆయన సలహా ఇంటర్నెట్‌లో ప్రజల దృష్టిని ఆకర్షించింది. పాతబడిన ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తే దాని నుంచి కొద్ది మొత్తంలో సీసం విడుదలవుతుందట (pressure cooker health risk). ఆ సీసం కుక్కర్‌లోని ఆహారంతో కలిసిపోతుంది. ఆ ఆహారం తిన్న వారి శరీరంలోకి కూడా సీసం ప్రవేశిస్తుంది.


శరీరంలోకి ప్రవేశించిన సీసం అంత సులభంగా బయటకు రాదు. కాలక్రమంలో ఆ సీసం.. రక్తం, ఎముకలు, మెదడులో పేరుకుపోతుంది. అది నాడీ వ్యవస్థ, మెదడు, ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని కూడా కోల్పోవచ్చు (memory loss in kids). ప్రెషర్ కుక్కర్ నుంచి సీసం లీక్ కావడం పిల్లలకు మరింత హానికరం. ఇది మెదడు అభివృద్ధిని నెమ్మదింపజేస్తుంది. వారి ఐక్యూ స్థాయిని తగ్గిస్తుంది.


ఇవి కూడా చదవండి..

ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2025 | 03:32 PM