Share News

Slippers: చెప్పులు ఇంటి బయట ఏ మూలన పెట్టాలో తెలుసా..

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:39 PM

ఎంత ఖరీదు చెప్పులైనా సరే ఇంటి బయట వదిలి పెట్టాల్సిందే. అయితే, చెప్పులను ఇంటి బయట ఎందుకు వదలాలి? ఇంటి బయట ఏ మూలన పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Slippers: చెప్పులు ఇంటి బయట ఏ మూలన పెట్టాలో తెలుసా..
Slippers Stand

వాస్తుశాస్త్ర ప్రకారం సింహద్వారం ఎదురుగా ఎప్పుడూ కూడా చెప్పులు విడవకూడదు. ఎందుకంటే సింహద్వారం అంటే సాక్షాత్తూ లక్ష్మీస్వరూపం. అలాంటి సింహద్వారం ఎదురుగా చెప్పులు విడిస్తే లక్ష్మీదేవీకి కోపం వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే చెప్పులను ఎట్టిపరిస్థితిలోనూ సింహద్వారం ముందు విడిచి లోపలికి పోకూడదు. ఎందుకంటే బయటకి వెళ్లినప్పుడు అనేక సమస్యలు, ఆలోచనలు, కోపం, చిరాకు వంటివి వస్తాయి. అవన్నీ వదిలేసి చెప్పుల స్టాండ్ ఎక్కడుందో చూసి అక్కడ విడిచిపెట్టి రావాలి. అది పిల్లలైనా సరే ఈ పద్ధతిని పాటించేలా చూసుకోవాలి. ఇలాచేస్తేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది.

నెగటివ్‌ ఎనర్జి

ఇలాంటి నియమం వెనుక మరో కారణం కూడా ఉంది. మనం బయటకి వెళ్లినప్పుడు రకరకాల చోట్లకి వెళ్లి వస్తాం. అలా తిరగడం వల్ల నెగటివ్‌ ఎనర్జి ఖచ్చితంగా ఉంటుందని, వాటిని ఇంట్లోకి తీసుకు రాకుండా ఉండేందుకు చెప్పులను సింహద్వారం ఎదుట విడవకూడదని అంటారు. బయట నుండి వచ్చినప్పుడు చెప్పులను ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదంటూ పండితులు చెబుతారు.


సూక్ష్మ క్రిములు..

బయట నుండి వచ్చినప్పుడు చెప్పులతోపాటు వందలాది సూక్ష్మ క్రిములు కూడా వస్తుంటాయి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే చెప్పులు బయటే విడిచిరావాలంటారు మన పెద్దలు.

శ్చిమ, నైరుతి దిశల్లోనే..

అలా అని చెప్పులు ఎలా పడితే అలా విడవకూడదు. సరైన దిశలోనే వాటిని ఉంచాలి. మెయిన్ డోర్ పక్కన కూడా ఎప్పుడు చెప్పుల స్టాండ్ ఉంచకూడదు. ప్రధాన ద్వారానికి రెండు, మూడు అడుగుల దూరంలో ఉంచాలి. చెప్పుల స్టాండ్‌ను పశ్చిమ, నైరుతి దిశల్లో ఉంచడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోను ఉత్తరం, ఆగ్నేయం, తూర్పు దిశలో చెప్పుల స్టాండ్‌ను ఉంచకూడదు.

Also Read: అమ్మాయిలకు, అబ్బాయిలకు షర్ట్ బటన్స్‌లో తేడా ఎందుకు..

Updated Date - Jan 31 , 2025 | 03:39 PM