Share News

Difference in Women, Men Shirt Button: అమ్మాయిలకు, అబ్బాయిలకు షర్ట్ బటన్స్‌లో తేడా ఎందుకు..

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:04 PM

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ధరించే జీన్స్, టీ షర్టులు ఒకేలా ఉన్నాయి. కేవలం షర్ట్ బటన్స్ విషయంలో మాత్రం చిన్న తేడా ఉంటుంది. అదేంటంటే..

Difference in Women, Men Shirt Button: అమ్మాయిలకు, అబ్బాయిలకు షర్ట్ బటన్స్‌లో తేడా ఎందుకు..
Women And Men Shirt Button

Women And Men Shirt Button Difference: ప్రస్తుత కాలంలో జీన్స్‌, టీ షర్ట్స్ ట్రెండ్ నడుస్తోంది. పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టంగా జీన్స్‌, టీ షర్ట్స్ వేసుకుంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇప్పుడు ఒకే రకం దుస్తులు వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. జీన్స్, టీ షర్టులు, షర్టులు ఏదైనా సరే.. అబ్బాయిలకు, అమ్మాయిలకు ఫ్యాషన్‌లో ఏ మాత్రం తేడా ఉండదు. అయితే, కేవలం షర్ట్ బటన్స్ విషయంలో మాత్రం చిన్న తేడా ఉంటుంది. అదేంటంటే.. అబ్బాయిల షర్టులకు కుడివైపు బటన్లు ఉంటే.. అమ్మాయిల షర్టులకు మాత్రం ఎడమవైపు బటన్లు ఉంటాయి. అయితే, షర్ట్ బటన్స్ విషయంలో ఈ తేడా ఎందుకు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


షర్ట్ బటన్స్ విషయంలో తేడా ఎందుకంటే..

13వ శతాబ్దంలో చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే షర్టులు వేసుకునే వారు. ఎందుకంటే ఆ కాలంలో షర్టు కొనుక్కోవడం చాలా పెద్ద విషయం. కేవలం ధనవంతుల కుటుంబాలకు చెందిన మహిళలు మాత్రమే తమ పనివారితో షర్టును ధరించుకునేవారు. ఆ కాలం మహిళలకు ఎడమ వైపు బటన్లను మూసివేయడం సులభం అని కనుగొన్నారు. అందువల్ల ఎడమ వైపు బటన్లను ఉంచే ప్రక్రియ అప్పట్లో మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. అంతేకాకుండా, ఒక నివేదిక ప్రకారం తల్లి పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు తరచుగా తమ పిల్లలను ఎడమ వైపున పట్టుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. అలాంటి సమయంలో మహిళలకు ఎడమ వైపున ఉన్న బటన్‌ను తెరవడం, మూసివేయడం చాలా సులభంగా ఉంటుంది.

ఇక మగవాళ్లు బటన్స్ విషయానికి వస్తే, మగవాళ్లు తమ బటన్స్ తామే పెట్టుకునే వారు.. కాబట్టి, కుడి చేతితో బటన్లను మూసివేయడం వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, యుద్ధంలో పాల్గొనే పురుషులు తమ ఆయుధాలను ఎడమ వైపున పెట్టుకునే వారని, ఆయుధాలను తీసేటప్పుడు వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కుడి వైపున బట్లను పెట్టేవారని తెలుస్తుంది. ఈ కారణంగా అబ్బాయిలకు కుడి వైపున బట్లను పెట్టడం అలవాటుగా మారింది.

Also Read: ఆన్‌లైన్ గేమ్ ఎంతపని చేసిందంటే.. చివరకు కన్నతల్లిని కూడా

Updated Date - Jan 31 , 2025 | 12:04 PM