Share News

Desi Jugaad: ఊబకాయం వల్ల ఇలాంటి ఉపయోగం ఉందా.. ఓ బాలుడు ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:41 PM

ఊబకాయం వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అధిక బరువును కలిగి ఉండడం వల్ల పలు ఆరోగ్య, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అయితే ఊబకాయం వల్ల కూడా ఓ ఉపయోగం ఉందని ఓ మహిళ నిరూపించింది.

Desi Jugaad: ఊబకాయం వల్ల ఇలాంటి ఉపయోగం ఉందా.. ఓ బాలుడు ఏం చేస్తున్నాడో చూడండి..
boy obesity rainwater

ఊబకాయం (Obesity) వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అధిక బరువును కలిగి ఉండడం వల్ల పలు ఆరోగ్య, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని అంటుంటారు. అయితే ఊబకాయం వల్ల కూడా ఓ ఉపయోగం ఉందని ఓ మహిళ నిరూపించింది. ఊబకాయుడైన తన కొడుకును ఉపయోగించిన ఆ మహిళ తన ఇంటిని వరద నుంచి కాపాడుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (funny jugaad).


@jayeetabhardwaj అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో (funny rain video) ప్రకారం.. భారీ వర్షాల కారణంగా ఒక కాలనీలో వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది. ఇళ్లలోకి కూడా ఆ వరద నీరు చేరిపోతోంది. దీంతో ఓ మహిళ లావుగా ఉన్న తన కొడుకును ఇంటి గుమ్మం ముందు కూర్చోపెట్టింది. దీంతో ఆ వరద నీరు ఆ బాలుడిని దాటి ఇంట్లోకి రావడం లేదు. ఆ బాలుడు లేకపోతే కచ్చితంగా ఆ ఇల్లు వరద నీటితో నిండిపోయేది (boy obesity rainwater).


ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో (Indian creativity) తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. 21 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. నిజమే.. ఊబకాయం కనీసం ఇలాగైనా ఉపయోగపడిందని ఒకరు కామెంట్ చేశారు. టైమ్ వస్తే.. దేనితోనైనా ఉపయోగం ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

పాముల ప్రేమగాథ.. ప్రియుడు చనిపోయాడని ఆ ఆడపాము ఏం చేసిందంటే..

మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలని మొత్తం పులులను 7 సెకెన్లలో కనిపెట్టండి..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2025 | 01:43 PM