Women Enjoy Hookah: పండుగ రోజు రెచ్చిపోయిన మహిళలు.. హుక్కా తాగుతూ..
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:48 AM
కొంతమంది మహిళలు కార్వా చౌత్ వేడుకలకు సిద్ధమయ్యారు. అందరూ ఒక చోట గుంపుగా చేరారు. కార్వా చౌత్ కోసం మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు. ఇంత వరకు అంతాబాగానే ఉంది.
కార్వా చౌత్ పండుగ సందర్భంగా కొంతమంది మహిళలు రెచ్చిపోయి ప్రవర్తించారు. గుంపుగా చేరి హుక్కా తాగుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ ఢిల్లీకి చెందిన కొంతమంది మహిళలు కార్వా చౌత్ వేడుకలకు సిద్ధమయ్యారు. అందరూ ఒక చోట గుంపుగా చేరారు. కార్వా చౌత్ కోసం మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు. ఇంత వరకు అంతాబాగానే ఉంది.
వారు అంతటితో ఆగకుండా హుక్కా తాగుతూ రచ్చ రచ్చ చేశారు. సాంప్రదాయ పండుగ రోజున పాడు పని చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల్లో లైక్స్ తెచ్చుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది తిడుతూ ఉంటే మరికొంతమంది వారు చేసిన పనిని సమర్ధిస్తూ ఉన్నారు. ‘విదేశీయులకంటే దారుణంగా తయారు అయ్యారు. మీరే మన సంప్రదాయాల్ని నాశనం చేస్తున్నారు’..
‘భర్తలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భార్యలు చేసే పండుగ. అలాంటి పండుగను కొంచెం కూడా శ్రద్ధ లేకుండా పాడు చేస్తున్నారు’..‘ఈ మధ్య కాలంలో జనం తమ ఎంజాయ్‌మెంట్ కోసం మాత్రమే ఏ పనైనా చేస్తున్నారు. వీళ్లు కూడా అంతే.. భర్తల మీద ప్రేమా.. పాడా’..‘ఇందులో ఏం తప్పు ఉంది. పాత సంప్రదాయానికి కొత్త హంగులు దిద్దారు. అంతేకానీ పాడు చేయటం లేదు’ అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ కలర్ మొలతాడు కడితే.. మీకు తిరుగులేనట్లే..
నిండు ప్రాణం తీసిన వేడి టీ.. టీ తాగిన రెండు రోజులకు..