Share News

Molathadu Benefits: ఈ కలర్ మొలతాడు కడితే.. మీకు తిరుగులేనట్లే..

ABN , Publish Date - Oct 11 , 2025 | 08:45 AM

నడుముకు మొలతాడు కట్టే ఆచారం మన పూర్వీకుల నుండి వస్తోంది. అయితే, ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

Molathadu Benefits: ఈ కలర్ మొలతాడు కడితే.. మీకు తిరుగులేనట్లే..
Molathadu Benefits

ఇంటర్నెట్ డెస్క్: మన పూర్వీకులు ఎన్నో సంప్రదాయాలను అనుసరిస్తూ వచ్చారు. కొన్ని ఆచారాలకు వాటి సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి విషయానికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి. వాటిలో కొన్నింటిని మనం కూడా పాటిస్తాం. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని ఆచారాలు మనకు మంచి చేస్తాయి. కానీ చాలా సందర్భాలలో దాని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయం. వాటిలో ఒకటి నడుముకు మొలతాడు కట్టే ఆచారం. పుట్టిన కొన్ని రోజుల తర్వాత లేదా పేరు పెట్టే సమయంలో బిడ్డ నడుముకు మొలతాడు కట్టే ఆచారం ఇప్పటికీ ఉంది. కొంతమంది అలాంటి ఆచారాలను నమ్మరు. కానీ, ఈ ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు.


మొలతాడు అనేది పురుషులు నడుము చుట్టూ ధరించే ఒక పవిత్రమైన దారం లేదా లోహంతో చేసిన అలంకారం. ఇది దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని, చెడును దూరం చేస్తుందని నమ్ముతారు. కొందరు వెండి, బంగారం, ప్లాటినం వంటి లోహాలతో కూడా మొలతాడును ధరిస్తారు. ఇది దుష్ట శక్తులు, చెడు ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్మకం. వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్న పాత సంప్రదాయం. ఆధ్యాత్మికంగానే కాకుండా, కొన్ని శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయని కొందరు నమ్ముతారు.

Molathadu.jpg


సాధారణంగా ఎరుపు లేదా నలుపు రంగులో ఉన్న మొలతాడు కట్టుకుంటారు. కానీ, ఎరుపు కన్నా నల్ల దారం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. ఇది మీ నడుము చుట్టూ బెల్ట్ లాగా పనిచేస్తుంది. మీరు బరువు పెరుగుతున్నారా లేదా తగ్గుతున్నారా అని తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. అది గట్టిగా ఉంటే, మీరు బరువు పెరుగుతున్నారని అర్థం. అది కొద్దిగా వదులుగా ఉంటే, మీరు బరువు తగ్గుతున్నారని అర్థం. అంటే ఇది మీ శరీరంలో జరుగుతున్న మార్పులను మీకు చూపుతుంది. అంతే కాదు, ఇది మీ నడుముపై ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది కొంతవరకు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. కడుపు చుట్టూ కొవ్వును తగ్గించడానికి మొలతాడు సహాయపడుతుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది

తినే ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు, ఇది జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కడుపులోని వ్యర్థాలను సరిగ్గా తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాదు, ఇది పిత్తాశయం, మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది హెర్నియాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.

Black.jpg


వెన్నెముక ఆరోగ్యానికి మంచిది

మొలతాడు ధరించడం వెన్నెముక ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా, ఇది వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది వెన్నునొప్పి, వెన్నెముక సమస్యలు, డిస్క్ హెర్నియేషన్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ రకమైన సమస్యలను నివారించడానికి చాలా మంది బెల్టులు ధరిస్తారు. కానీ వాటి కంటే మొలతాడు మంచిది.


సంతానోత్పత్తి సమస్యలను నివారిస్తుంది

సాధారణంగా నడుము చుట్టూ నల్ల దారం కట్టుకుంటారు. నడుము చుట్టూ కట్టినప్పుడు, అది చుట్టుపక్కల అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది సంతానోత్పత్తి సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొన్నిసార్లు వేడి పెరగడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంది, అందుకే నల్ల దారాన్ని కట్టమని నిపుణులు సిఫార్సు చేస్తారు. నిజానికి, పొట్ట ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకూడదు. ఇది శరీర ఉష్ణోగ్రతలో మార్పులకు కారణమవుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కానీ నల్ల దారం ఈ సమస్యలన్నింటినీ నివారిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 09:20 AM