Woman Quits Govt Bank Job: గవర్నమెంట్ జాబ్ వదిలేసిన యువతి.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:41 AM
వాణి అనే 29 ఏళ్ల యువతికి 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం తెచ్చుకోవటానికి ఆమె చాలా కష్టపడింది. ఓ సంవత్సరం పాటు ఐబీపీఎస్ ఎగ్జామ్ కోసం ట్రైనింగ్ తీసుకుంది.
ఈ దేశంలో ఎక్కువ శాతం మంది జనం గవర్నమెంట్ జాబ్ కోసం తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. సంవత్సరాల పాటు కష్టపడి జాబ్‌ల కోసం ప్రిపేర్ అవుతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే గవర్నమెంట్ జాబ్ సాధించగలుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం సెటిల్ అయిపోయినట్లే.. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు అనుకుంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం ఓ యువతి ఎంతో కష్టపడి సాధించిన గవర్నమెంట్ జాబ్‌ను వదిలేసింది. కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఆమెకు మనస్సాంతి కావాలంట. తను చేసే గవర్నమెంట్ జాబ్‌లో మనస్సాంతి లేదని మానేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన వాణి అనే 29 ఏళ్ల యువతికి 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం తెచ్చుకోవటానికి ఆమె చాలా కష్టపడింది. ఓ సంవత్సరం పాటు ఐబీపీఎస్ ఎగ్జామ్ కోసం ట్రైనింగ్ తీసుకుంది. జాబ్ వచ్చిన తర్వాత స్కేల్ వన్ ఆఫీసర్‌గా మీరట్‌లో పోస్టింగ్ వేశారు. లోన్లకు సంబంధించిన విభాగంలో ఆమె పని చేసేది. మూడేళ్లు కూడా పని చేయకుండానే ఆమె జాబ్ మానేసింది.
దీనిపై వాణి మాట్లాడుతూ.. ‘నేను బ్యాంక్ జాబ్‌లో చేరకముందు ఎంతో సంతోషంగా.. జాలీగా ఉండేదాన్ని. కానీ, గత మూడేళ్లలో నన్ను నేను అసహ్యించుకునే స్థాయికి చేరిపోయాను. చిరాకు, విసుగు వచ్చేశాయి. మనస్సాంతి బొత్తిగా లేకుండా పోయింది. అందుకే జాబ్ మానేశాను. నేను తీసుకున్న ఈ నిర్ణయంతో నాకేమీ బాధ లేదు. నన్ను నమ్మండి.. మనది కాని ప్రదేశాన్ని విడిచి పెట్టినపుడు కలిగే సంతోషం.. రీగ్రెట్‌గా ఫీలయ్యేదానికంటే ఎంతో గొప్పది. చాలా మంది దూరంనుంచే అన్నీ జడ్జ్ చేస్తూ ఉంటారు. నేను ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాను. అది నా డ్రీమ్ జాబ్. కానీ, వాస్తవం వేరేలా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
ఇవి కూడా చదవండి