Share News

Internship: చదువుల్లో యువతి టాప్.. 10కి పైగా మెడల్స్ వచ్చినా ఇంటర్న్‌షిప్ దక్కక యువతికి షాక్

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:37 PM

చదువులో టాపర్‌గా ఉన్నా ఇంటర్న్‌షిప్ దక్కక ఓ యువతి అంతృప్తితో నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన విషయాలతో అనేక మంది ఏకీభవించారు.

Internship: చదువుల్లో యువతి టాప్.. 10కి పైగా మెడల్స్ వచ్చినా ఇంటర్న్‌షిప్ దక్కక యువతికి షాక్
Delhi University student viral post on Intership

ఇంటర్నెట్ డెస్క్: చదువుల్లో టాపర్‌గా ఉన్నా ఇంటర్న్‌షిప్ దక్కించుకోలేక అవస్థ పడుతున్న ఢిల్లీ యూనివర్సిటీ యువతి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీంతో, జాబ్ మార్కెట్‌లో టాప్ మార్కులకు ఉన్న ప్రాధాన్యంపై చర్చ మొదలైంది. ఢిల్లీ హంస్‌రాజ్ కాలేజ్‌కు బీఏ తొలి సంత్సరం చదువుతున్న యువతి బిస్మా లింక్డ్‌ఇన్‌లో ఈ పోస్టు పెట్టింది. చదువులో టాప్‌లో ఉన్నా తనకు ఇంటర్న్‌షిప్ దక్కకపోవడంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది.


‘‘నేను కాలేజీలో టాపర్. నా టీచర్లు, ప్రొఫెసర్లు అందరూ చదువుపై దృష్టి పెట్టాలని చిన్నప్పటికీ నుంచీ చెప్పారు. చదువు ఏదోక రోజు అక్కరకు వస్తుందని అన్నారు. కానీ వాస్తవం మాత్రం కాస్త భిన్నంగా ఉంది. బట్టీపట్టిన ఆన్సర్లను వల్లెవేసే అభ్యర్థులకు అక్కడ కంపెనీలేమీ క్యూ కట్టడం లేదు. అంచనాల మేరకు నైపుణ్యాలు ప్రదర్శిస్తూ పని పూర్తి చేయగలిగిన వారే వాళ్లకు కావాలి. నేనేమీ మిమ్మల్ని పుస్తకాలు తగలబెట్టమనడం లేదు. నేననేదేంటంటే.. ఏదోక నైపుణ్యం నేర్చుకోండి. అందులో పట్టు సాధించండి. అప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 50కిపైగా సర్టిఫికేట్లు, 10కి పైగా మెడల్స్, 10కిపైగా ట్రోఫీలు.. వీటిల్లో ఏ ఒక్కటీ నాకు ఇంటర్న్‌షిప్ తెచ్చిపెట్టలేదు’’ అని ఆమె అన్నారు.


ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘ఇది చాలా నిజం. సమాజం అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఇది’’ అని ఓ వ్యకత్ి అన్నారు. ‘‘నేను ఎప్పుడూ వెనక బెంచ్‌లోనే కూర్చునే వాడిని. చదువుల్లో ఎప్పుడూ యావరేజే. మెడల్స్ వంటివేవీ లేవు. కానీ ఆ దశను బాగానే ఎంజాయ్ చేశా. కానీ డిగ్రీ చదువుతున్నప్పుడు మార్కులు కాలేజీ పరిసరాల వరకే పరిమితమని నాకు అర్థమైంది. వాస్తవ ప్రపంచంలో కంపెనీలు మీకు ఎన్ని మార్కులు వచ్చాయని పట్టించుకోవు. వాళ్లకు నైపుణ్యాలు కావాలి. పాఠాల్లో నేర్చుకునే సిద్ధాంతాలు చాలా అరుదుగా మాత్రమే ఉద్యోగంలో అక్కరకు వస్తాయి. దీంతో, ప్రాగ్రామింగ్ లాంగ్వేజీలు, ఫ్రేమ్‌వర్క్స్, టూల్స్ వంటివాటిపై దృష్టి పెట్టా. ఫ్రీలాన్సింగ్ వంటివి చేశా. అనుభవం గడించా. ఇది కెరీర్‌లో నాకు బాగా ఉపకరించింది’’ అని మరొకరు అన్నారు. డిగ్రీలు కెరీర్ మొదట్లో ఉపయోగపడతాయోమే గానీ దీర్ఘకాలంలో అక్కరకు వచ్చేవి నైపుణ్యాలేనని మరొకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..

Read Latest and Viral News

Updated Date - Apr 19 , 2025 | 09:13 PM