Share News

Women Metro Brawl Seat Dispute: సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:38 PM

Women Metro Brawl Seat Dispute: ఈ మధ్య కాలంలో మెట్రో రైల్లో ఆడవాళ్ల గొడవలు ఎక్కువైపోయాయి. సీట్ల కోసం దారుణంగా కొట్టుకుంటున్నారు. కొన్సిసార్లు ఆ ఫైట్లు డబ్ల్యూడబ్ల్యూఈని తలపిస్తూ ఉన్నాయి.

Women Metro Brawl Seat Dispute: సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..
Women Metro Brawl Seat Dispute

బస్సులు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడ్డం అన్నది సర్వ సాధారణమైన విషయం. మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మెట్రో రైల్లో ఆడవాళ్ల గొడవలు ఎక్కువైపోయాయి. సీట్ల కోసం దారుణంగా కొట్టుకుంటున్నారు. కొన్సిసార్లు ఆ ఫైట్లు డబ్ల్యూడబ్ల్యూఈని తలపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీట్ల కోసం తరచుగా మహిళల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి.


తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇద్దరు మహిళలు సీటు కోసం కొప్పులు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఎలా మొదలైందో తెలీదు కానీ, మొత్తానికి ఓ ఇద్దరు మహిళల మధ్య సీటు కోసం గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా అయింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు. తెల్ల చొక్కా వేసుకున్న మహిళ మరో మహిళపై విరుచుకుపడింది. ఆమెను సీటుపై పడేసి జట్టుపట్టుకుంది. ప్రత్యర్థి మహిళ కిందపడ్డా కూడా వెనక్కు తగ్గలేదు.


చొక్కా వేసుకున్న మహిళ జుట్టుపట్టుకోవడానికి తెగ ప్రయత్నించింది. ఇద్దరూ డోరు పక్కన ఉన్న సీట్లో పడి కొట్టుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ అక్కడికి వచ్చింది. వారిని విడిపించే ప్రయత్నం చేసింది. వాళ్లు మాత్రం ఆగలేదు. ఈ గొడవకు సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో సున్నితత్వం బాగా తగ్గిపోయింది. మరీ ఇంతలా కొట్టుకుంటారా?’..‘3 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో సీటు కోసం కూడా గొడవపడుతున్నారు. ఆడవారి కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించినా గొడవలు ఆగటం లేదు’ అని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అదనపు కట్నం కోసం భార్య హత్య.. భర్తపై ఎన్‌కౌంటర్..

ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన

Updated Date - Aug 24 , 2025 | 03:38 PM