Dowry Case Accused: అదనపు కట్నం కోసం భార్య హత్య.. భర్తపై ఎన్‌కౌంటర్..
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:53 PM
Dowry Case Accused: గురువారం విపిన్, విపిన్ తల్లి దయ కలిసి నిక్కిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటారు. తీవ్ర గాయాలపాలైన నిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విపిన్‌ను నిన్న అరెస్ట్ చేశారు.
అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతున్న అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి గాయాలు అయ్యాయి. ప్రాణాలకు ఏమీ కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన విపిన్ భాటి తన భార్య నిక్కి భాటిని అదనపు కట్నం కోసం వేధించాడు. ప్రతీ నిత్యం అత్తింటి వారందరూ నిక్కిపై దాడి చేస్తూ వచ్చారు.
గురువారం విపిన్, విపిన్ తల్లి దయ కలిసి నిక్కిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటారు. తీవ్ర గాయాలపాలైన నిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విపిన్‌ను నిన్న అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నిక్కి తండ్రి భికారీ సింగ్ పాయ్‌లా మీడియాతో మాట్లాడుతూ.. ‘వాళ్లు హంతకులు . వాళ్లను కాల్చి చంపాలి. వాళ్ల ఇంటిని కూల్చేయాలి. వాళ్ళు నా కూతుర్ని హింసించారు. అత్తింటి వారందరూ కలిసి ఆమెను చంపేశారు.
కుట్రలో అందరికీ భాగం ఉంది’ అని అన్నారు. కొన్ని గంటల తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్న విపిన్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి గాయాలు అయ్యాయి. పోలీసులు అతడ్ని పట్టుకుని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సీనియర్ పోలీస్ అధికారి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘మేము విపిన్‌ను ఈ రోజు అతడి ఇంటికి తీసుకెళ్లాము.
భార్య నిక్కిని కాల్చడానికి ఉపయోగించిన లిక్కిడ్ ఉన్న బాటిల్ రికవర్ చేసుకోవడానికి వెళ్లాం. అప్పుడు విపిన్ ఓ పోలీసు దగ్గరినుంచి తుపాకిని లాక్కున్నాడు. కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే మేము కూడా ఎదురు కాల్పులు జరిపాము. దీంతో అతడి కాలికి గాయం అయింది’ అని తెలిపారు. కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన విపిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నా భార్యను ఏమీ చేయలేదు. తనంతట తానే చనిపోయింది. ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు చెప్పండి’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం..
విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల