Crocodile Video: వీడియో చూస్తే భయంతో వణకడం ఖాయం.. చనిపోయిన మొసలిపై కర్ర పెడితే..
ABN , Publish Date - Jun 10 , 2025 | 06:10 PM
నీటిలో మొసళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. వాటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అవి కదలకుండా ఉన్నా సరే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే మొసళ్లు ఎరను పట్టుకోవడం కోసం రకరకాల ట్రిక్‌లు ప్లే చేస్తాయి. తాజాగా ఓ మత్స్యకారుడికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది.

నీటిలో మొసళ్లు (Crocodile) అత్యంత ప్రమాదకరమైనవి. వాటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అవి కదలకుండా ఉన్నా సరే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే మొసళ్లు ఎరను పట్టుకోవడం కోసం రకరకాల ట్రిక్‌లు ప్లే చేస్తాయి. తాజాగా ఓ మత్స్యకారుడికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది. ఆ వీడియో చూసిన వారు కూడా అలాగే భయపడుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Crocodile Video).
hereyourjumpscare అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు మత్స్యకారులు నదిపై బోటులో ప్రయాణిస్తున్నారు. వారికి నీటిపై తేలియాడుతున్న మొసలి కనిపించింది. అది చనిపోయిందని వారు అనుకున్నారు. బోటును దాని సమీపంలోకి తీసుకెళ్లారు. అయినా అది మాత్రం కదల్లేదు. దాంతో ఓ వ్యక్తి కర్ర తీసి ఓ మొసలి తలపై గుచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆ మొసలి దాడికి దిగింది. దీంతో అందరూ భయపడిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 80 లక్షల మందికి పైగా వీక్షించారు. మూడు లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. మొసలి తెలివితేటలను చూసి నా ఆత్మ వణికిపోయిందని ఒకరు వ్యాఖ్యానించారు. మొసళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని మరొకరు సూచించారు. చాలా భయం వేసిందని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Ice Bath Video: వావ్.. ఏం ఐడియా గురూ.. వేసవిలో చన్నీళ్ల స్నానానికి సూపర్ ట్రిక్..
Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..