Share News

DNA test shock: ఆ దంపతులు సరదాగా డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్నారు.. దెబ్బకు అంతా మారిపోయింది..

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:33 PM

వారిద్దరూ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కలిసి అందమైన జీవితాన్ని నిర్మించుకున్నారు. సంతోషంగా జీవిస్తున్నారు. ఆ సమయంలో ఒక డీఎన్ఏ టెస్ట్ వారి జీవితాలను మార్చేసింది.

DNA test shock: ఆ దంపతులు సరదాగా డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్నారు.. దెబ్బకు అంతా మారిపోయింది..
unbelievable story

వారిద్దరూ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కలిసి అందమైన జీవితాన్ని నిర్మించుకున్నారు. సంతోషంగా జీవిస్తున్నారు. ఆ సమయంలో ఒక డీఎన్ఏ టెస్ట్ వారి జీవితాలను మార్చేసింది. సరదాగా చేయించుకున్న పరీక్ష వారి భవిష్యత్తుకు సవాలుగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఆ మహిళ రెడ్డిట్‌లో తన కథను పంచుకుంది (couple DNA test).


ఆ మహిళ తన తల్లికి వేరే దాత ఇచ్చిన వీర్యం ద్వారా జన్మించింది. భర్తకు ఆరోగ్య సమస్యల ఉన్న కారణంగా ఆ మహిళ తల్లి వేరే దాత ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం ఆ బిడ్డకు చిన్నప్పట్నుంచి తెలుసు. ఆమె పెరిగి పెద్దదై వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ఆ సమయంలో ఆమె తన జన్మ రహస్యం తెలుసుకోవాలనుకుంది. తన తల్లికి వీర్య దానం చేసిన దాత ఎవరో తెలుసుకుందామని డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకుంది. అయితే ఆ వచ్చిన రిజల్ట్ ఆమెను షాక్‌కు గురి చేసింది (shocking revelation).


ఎందుకంటే ఆ మహిళ డీఎన్‌ఏ ఆమె భర్త డీఎన్ఏతో మ్యాచ్ అయింది. ఇది టెస్ట్ చేసిన ల్యాబ్ తప్పిదం కావచ్చొని మరో పదిసార్లు టెస్ట్ చేసుకుంది. అన్ని టెస్ట్‌ల్లోనూ రిజల్ట్ ఒకటే. ఆమెది, ఆమె భర్తది ఒకటే డీఎన్‌ఏ. చివరకు తన తల్లికి వీర్య దానం చేసింది తన భర్త తండ్రి అని తెలుసుకుని ఆమె నివ్వెరపోయింది. మామగారు ఇచ్చిన వీర్యం ద్వారా ఆమె జన్మించింది. అంటే ఆ మహిళ, ఆమె భర్త జీవ శాస్త్రపరంగా తోబుట్టువులు (family secret).


ఈ విషయాన్ని ఆమె రెడ్డిట్ ద్వారా పంచుకుంటూ.. 'నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను. మేము కలిసి అందమైన జీవితాన్ని నిర్మించుకున్నాము. ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నాము. కానీ ఈ నిజం ప్రతిదీ మార్చివేసింది. మా మొత్తం గుర్తింపు ముక్కలైపోయినట్లు అనిపిస్తోంది' అని పేర్కొంది (unbelievable story). ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నమ్మశక్యం కానిది అయినప్పటికీ హృదయ విదారకం' అని ఒకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 05 , 2025 | 03:33 PM