Viral Video: పెట్రోల్ విషయంలో గొడవ.. పోలీస్‌ను కొట్టిన పెట్రోల్ బంక్ సిబ్బంది..
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:02 PM
Viral Video: ఓ పోలీస్ తన వాహనానికి పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. 120 రూపాయల పెట్రోల్ కొట్టమని పెట్రోల్ బంక్ బాయ్‌కి చెప్పాడు. అయితే, పెట్రోల్ బంక్ బాయ్ 120 రూపాయలకు బదులు పొరపాటున 720 రూపాయల పెట్రోల్ కొట్టాడు.

ఒకప్పుడు పోలీసులంటే ఓ భయం ఉండేది. వాళ్ల జోలికి పోవాలంటే వణుకు పుట్టేది. కొట్టినా, తిట్టినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కాలం మారింది.. కాలంతో పాటు పరిస్థితులు కూడా మారాయి. పోలీసులంటే జనాలకు గతంలో ఉన్న భయం కూడాపోయింది. మాటకు మాట సమాధానం చెప్పడం.. కొడితే తిరిగి కొట్టడం లాంటివి చేస్తున్నారు. అన్యాయంగా తమపై దాడి చేస్తే ఊరుకోవటం లేదు. తాజాగా, ఓ పోలీస్ పెట్రోల్ బంక్ బాయ్‌పై రెచ్చిపోయాడు. అతడిపై చెయ్యి చేసుకున్నాడు.
దీంతో రచ్చ మొదలైంది. దెబ్బలు తిన్న వ్యక్తి.. మరో వ్యక్తి కలిసి పోలీస్‌ను చావగొట్టారు. ఈ సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్, సీతామర్హి జిల్లాకు చెందిన ఓ పోలీస్ తన వాహనానికి పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. 120 రూపాయల పెట్రోల్ కొట్టమని పెట్రోల్ బంక్ బాయ్‌కి చెప్పాడు. అయితే, పెట్రోల్ బంక్ బాయ్ 120 రూపాయలకు బదులు పొరపాటున 720 రూపాయల పెట్రోల్ కొట్టాడు.
దీంతో పోలీస్‌కు కోపం వచ్చింది. పెట్రోల్ బంక్ సిబ్బందిని కొట్టాడు. ఇది గమనించిన పెట్రోల్ బంక్ మేనేజర్ అక్కడికి వచ్చాడు. పోలీస్‌తో గొడవ పెట్టుకున్నాడు. తన్నులు తిన్న వ్యక్తి.. మేనేజర్ కలిసి పోలీస్‌పై దాడికి దిగారు. పోలీస్‌ను చితక్కొట్టారు. పోలీస్ వారినుంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..
వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ ఫోన్లలో ఇకపై పని చేయదు..