WhatsApp Stop Working: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ ఫోన్లలో ఇకపై పని చేయదు..
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:10 AM
WhatsApp Stop Working: సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పని చేయదు.

వాట్సాప్ వాడకం నేడు ఓ అత్యవసరం అయిపోయింది. ప్రతీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. యూజర్లకు మంచి అనుభూతిని ఇచ్చేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు సంతరించుకుంటోంది. అంతేకాదు.. సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పని చేయదు.
ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లలో వాట్సాప్ పని చేయదు. వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త అప్‌డేట్ ఐఓఎస్ 15.1 కంటే తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సపోర్టులో చేయదు. ఇక, ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికి వస్తే.. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, గెలాక్సీ నోట్ 3, సోనీ ఎక్స్‌పీరియా జెడ్1, ఎల్‌జీ జీ2, హ్యూవే ఆసెండ్ పీ6, మోటో జీ ( ఫస్ట్ జెనరేషన్) హెచ్‌టీసీ వన్ ఎక్స్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ వాట్సాప్ కొత్త వర్షన్ ఇందులో పని చేయదు. ప్రస్తుతం 5.0, అంతకంటే తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో సేవలు నిలిచిపోనున్నాయి.
రెగ్యులర్ సిస్టమ్ రివ్యూస్‌లో భాగంగా.. ఔట్ డేట్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు వాట్సాప్ తమ సేవల్ని నిలిపివేస్తోంది. తక్కువ మంది యూజర్లు ఉండటం.. సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు అంతగా అవకాశం లేకపోవటం వంటి కారణాలతో ఆ ఫోన్లలో సేవలు ఆపేస్తోంది.
మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇలా చెక్ చేసుకోండి
ఐఫోన్లు
మొదటగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. తర్వాత జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అక్కడ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో తెలిసిపోతుంది.
ఆండ్రాయిడ్
మొదటగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. తర్వాత ఎబౌట్ ఫోన్ క్లిక్ చేయండి. అక్కడ మీ ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటో ఉంటుంది.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
చదువుకోసం చిన్నారుల సాహసం.. ప్రాణాలకు తెగించి..