Share News

Speeding SUV Crash: ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ABN , Publish Date - Jul 05 , 2025 | 10:55 AM

Speeding SUV Crash: పెళ్లి కోసం సురాజ్ కుటుంబసభ్యులు పది మంది బొలెరో కారులో సిర్తోల్ బయలుదేరారు. కారులోని వారు జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ, తుళ్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తాయని వారికి తెలీదు పాపం.

Speeding SUV Crash: ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..
Speeding SUV Crash

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అతి వేగం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. కారు వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుకకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కుమారుడితో పాటు చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, శంభాల్ జిల్లా, హర్ గోవింద్‌పూర్‌కు చెందిన సురాజ్‌కు కొన్ని నెలల క్రితం సిర్తోల్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయం అయింది.


శనివారం పెళ్లి కూతురి ఇంటి దగ్గర పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. పెళ్లి కోసం సురాజ్ కుటుంబసభ్యులు పది మంది బొలెరో కారులో సిర్తోల్ బయలుదేరారు. కారులోని వారు జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ, తుళ్లుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తాయని వారికి తెలీదు పాపం. కారు అతి వేగంగా ముందుకు దూసుకెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే జవానాయ్ గ్రామం దగ్గర కారు అదుపు తప్పింది. జనతా ఇంటర్ కాలేజీ గోడను బలంగా ఢీకొట్టింది.


ఆ వెంటనే కారు తిరిగి పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారిని స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన 10 మందిని.. సురాజ్, ఆశ, ఐశ్వర్య, విష్ణు, మనోజ్, కోమల్, గణేష్, మధు,సచిన్, రవిలుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చనిపోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఇవి కూడా చదవండి

బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. ఇక వారికి కష్టమే..

ఈ రాయి ధర 34 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే..

Updated Date - Jul 05 , 2025 | 11:00 AM