Share News

NWA 16788 To Fetch: ఈ రాయి ధర 34 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే..

ABN , Publish Date - Jul 05 , 2025 | 08:56 AM

NWA 16788 To Fetch: అది మార్స్ గ్రహానికి చెందిన రాయి. ఆ రాయి భూమ్మీద ఉన్న అతి పెద్ద మార్స్ రాయి అని సైంటిస్టులు భావిస్తున్నారు. దాని బరువు 24.67 కేజీలు. ఆ రాయికి సైంటిస్టులు NWA-16788 అని పేరుపెట్టారు.

NWA 16788 To Fetch: ఈ రాయి ధర 34 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే..
NWA 16788 To Fetch

పైన కనిపిస్తున్న ఫొటోలోని రాయి ధర అక్షరాలా 34 కోట్ల రూపాయలు. రాయి 34 కోట్లా.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అయితే, ఆ రాయి మీరు అనుకున్నట్లు మామూలు రాయి కాదు. అసలు భూమికి చెందింది కూడా కాదు. అది మార్స్ గ్రహానికి చెందిన రాయి. ఆ రాయి భూమ్మీద ఉన్న అతి పెద్ద మార్స్ రాయి అని సైంటిస్టులు భావిస్తున్నారు. దాని బరువు 24.67 కేజీలు. ఆ రాయికి సైంటిస్టులు NWA-16788 అని పేరుపెట్టారు. గతంలో మాలీలో ఓ మార్స్ రాయి దొరికింది. దానికి సైంటిస్టులు తావ్‌డెన్నీ 002 అని పేరుపెట్టారు.


2021లో దొరికిన తావ్‌డెన్నీ 002 బరువు 14.51 కేజీలు ఉంది. NWA-16788.. తావ్‌డెన్నీ కంటే 70 రెట్లు బరువైంది. 2023 నవంబర్ నెలలో నైజర్‌లోని అగ్‌దెజ్ ప్రాంతంలో దొరికింది. ఉల్కల కోసం అన్వేషించే ఓ వ్యక్తికి ఇది దొరికింది. నైజర్‌లోని అగ్‌దెజ్ ప్రాంతంలో ఎక్కువగా డైనోసార్ల శిలాజాలు దొరుకుతూ ఉంటాయి. అత్యంత అరుదుగా ఇలా ఉల్కలు దొరుకుతూ ఉన్నాయి. సైంటిస్టులు ఈ మార్స్ రాయికి సంబంధించిన ఓ ముక్కను షాంగైలోని ఆస్ట్రానమీ మ్యూజియానికి పంపారు. అక్కడ దాన్ని పరీక్షించిన ల్యాబ్ నిపుణులు.. అది మార్సుకు చెందిన రాయిగా తేల్చారు.


ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆ మార్స్ రాయిని వచ్చే నెలలో వేలానికి పెట్టనున్నారు. ఆ రాయి నాలుగు మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయే అవకాశం ఉందని వేలం పాట నిర్వహకులు భావిస్తున్నారు. అయితే, ఈ మార్స్ రాయి వేలం పాట‌పై మిశ్రమ స్పందన వస్తోంది. దాన్ని అమ్మే బదులు.. సైన్స్ పరీక్షల కోసం ఫ్రీగా ఇవ్వొచ్చు కదా అని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.


ఇవి కూడా చదవండి

ఏంటిది మాగ్నస్.. ఓటమి ఒప్పుకోవడానికి ఇంత భయమా..

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Updated Date - Jul 05 , 2025 | 08:56 AM