Cobra vs mongoose: ఈ పాము చాలా లక్కీ.. ముంగిస బారి నుంచి ఎలా బయటపడిందో చూడండి..
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:30 PM
పాములంటే మనుషులే కాదు.. ఎన్నో క్రూరమృగాలు కూడా భయపడతాయి. ఇక, నాగుపాము జోలికి వెళ్లేందుకు సింహం అయినా సాహసించదు. నాగుపాము కాటు వేస్తే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోవడం ఖాయం. అయితే ఎంతటి విషపూరిత నాగుపాము అయినా ముంగిస అంటే భయపడుతుంది.
పాములంటే మనుషులే కాదు.. ఎన్నో క్రూరమృగాలు కూడా భయపడతాయి. ఇక, నాగుపాము జోలికి వెళ్లేందుకు సింహం అయినా సాహసించదు. నాగుపాము కాటు వేస్తే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోవడం ఖాయం. అయితే ఎంతటి విషపూరిత నాగుపాము అయినా ముంగిస అంటే భయపడుతుంది. పాముతో తలపడేందుకు, దానిని చంపేందుకు ముంగిస ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే పాము, ముంగిసల ఫైటింగ్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (mongoose attack).
d.charpota.51 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను రాజస్థాన్‌లోని పిపాల్ఖుంట గ్రామంలో చిత్రీకరించారు. వాహనాలు వెళ్తున్న ఓ రోడ్డు మధ్యలో ఓ నాగుపాము పడగ విప్పి కూర్చుంది. రోడ్డు మధ్యలో ఉన్న నాగుపామును చూసి అందరూ తమ వాహనాలను ఆపివేశారు. కొందరు వీడియోలు తీయడం ప్రారంభించారు. అదే సమయంలో రోడ్డు పక్కన పొదల నుంచి భారీ ముంగిస ఆ పాము దగ్గరకు వచ్చింది. పాముతో పోరాటానికి సిద్ధపడింది. అయితే అప్పటికే వాహనాల నుంచి దిగిన ప్రజలు గట్టిగా అరవడంతో ఆ ముంగిస అక్కడి నుంచి పారిపోయింది (cobra mongoose fight).
మనుషులు అండగా నిలబడడంతో ముంగిసతో పోరాడకుండానే ఆ పాము తన ప్రాణాలను కాపాడుకుంది (dramatic animal fight). ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను కోట్ల మంది వీక్షించారు. 3 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అక్కడున్న వారు పామును కాపాడి తన మానవత్వాన్ని ప్రదర్శించారని చాలా మంది ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..