Valentine's day: వివాహం తర్వాత మొదటి వాలెంటైన్స్ డేని ఇలా స్పెషల్‌గా చేసుకోండి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 07:51 PM
వివాహం తర్వాత మొదటి వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారా? అయితే, ఈ వాలెంటైన్స్ డేని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి మీ ఇంటిని ప్రేమ రంగులతో అలంకరించుకోండి.
వివాహం తర్వాత వచ్చే మొదటి వాలెంటైన్స్ డే చాలా ప్రత్యేకమైనది. ఈ వాలెంటైన్స్ డేని మరింత స్పేషల్‌గా మార్చడానికి మీరు మీ ఇంటిని ప్రేమ రంగులతో అలంకరించవచ్చు. వాలెంటైన్స్ డే కోసం మీ ఇంటిని అందంగా అలంకరించడానికి, మీ జీవిత భాగస్వామిపై మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ టిప్స్ ట్రై చేయండి..
బెలూన్స్ వాడండి
బెలూన్లు ఉపయోగించి మీరు మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి. ఎరుపు అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి ఎర్ర రంగు బెలూన్లను ఉపయోగించి అందంగా డెకరేట్ చేయండి.
లైట్లు, కొవ్వొత్తులు
వాలెంటైన్స్ డే మరింత స్పెషల్‌గా ఉండటం కోసం మీరు స్ట్రింగ్ లైట్లు, కొవ్వొత్తులను ఉపయోగించండి. ఇది చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
గులాబీ రేకులతో డేకరేషన్
గులాబీ రేకులను ఉపయోగించి చిన్న రంగోలి తయారు చేయడం ద్వారా మీరు మీ భాగస్వామిని ఆకట్టుకోవచ్చు. రంగోలి మధ్యలో ఎర్రటి కొవ్వొత్తిని ఉంచితే చాలా అందంగా ఉంటుంది.
ఫోటో ఫ్రేమ్
వాలెంటైన్స్ డే నాడు మీ పెళ్లి ఫొటోలను గిఫ్ట్ ఇవ్వండి. మీ జీవితంలో అత్యంత మదురమైన జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోండి. దీంతో పాటు స్పెషల్‌గా కేక్, రుచికరమైన వంటలను తయారు చేయండి.
Also Read: ప్రేమికుల దినోత్సవం కోసం.. భారీగా రోజాల దిగుమతి