Luxury Jaguar Mows Down: జాగ్వార్ కారు బీభత్సం.. క్షణాల్లో ప్రాణం పోయింది..
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:54 PM
కారు రాజ్‌రూపర్ ఏరియాలోకి రాగానే అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే మెయిన్ రోడ్డుపైకి దూసుకువచ్చింది. రోడ్డు పక్కన ఉన్న మనుషులు, తోపుడు బళ్లు, వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లింది.
ఖరీదైన జాగ్వార్ కారు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మరి కొంతమందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కొడుకు రచిత్ మధ్యన్ జాగ్వార్ కారులో రోడ్డుపై ప్రయాణిస్తూ ఉన్నాడు.
కారు రాజ్‌రూపర్ ఏరియాలోకి రాగానే అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే మెయిన్ రోడ్డుపైకి దూసుకువచ్చింది. రోడ్డు పక్కన ఉన్న మనుషులు, తోపుడు బళ్లు, వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకువెళ్లింది. ఓ చోట ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే 55 ఏళ్ల ప్రదీప్ అనే వ్యక్తి చనిపోయాడు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రచిత్ కూడా గాయపడ్డాడు. గాయపడ్డ వారందరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.
చికిత్స అనంతరం రచిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం నిందితుడ్ని కోర్డులో హాజరుపరిచారు. కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
మొసలికి చిక్కిన జింక.. దాడి చేసేందుకు వచ్చిన హైనా.. చివరికి సినిమా ట్విస్ట్..
పాకిస్థాన్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం