Share News

Viral Video: అరుదైన దృశ్యం.. పిల్లులు, ఎలుకల స్నేహం..

ABN , Publish Date - Jul 09 , 2025 | 08:04 AM

Real Life Tom And Jerry: ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన అత్యంత అరుదైన సంఘటనల్లో టాప్ 1లో ఉంటుంది. ఎందుకంటే.. పదుల సంఖ్యలో పిల్లుల మధ్యలో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. తిరగటమే కాదు.. పిల్లులు, ఎలుకలు కలిసి తిండి తింటున్నాయి.

Viral Video: అరుదైన దృశ్యం.. పిల్లులు, ఎలుకల స్నేహం..
Real Life Tom And Jerry

టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్లు ఉండరనే చెప్పాలి. ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు టామ్ అండ్ జెర్రీకి అభిమానులు ఉన్నారు. టామ్ అండ్ జెర్రీ స్టోరీ విషయానికి వస్తే.. ఆ రెండు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి. అయితే, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. కొన్నిసార్లు తమ ప్రేమతో ప్రేక్షకుల్ని పిచ్చెక్కిస్తాయి. ఇక, రియల్ లైఫ్ విషయానికి వస్తే.. సాధారణంగా పిల్లులు, ఎలుకలకు అస్సలు పడదు. ఎలుకలు కనిపిస్తే చాలు పిల్లులు చంపి తినేస్తాయి. పిల్లి, ఎలుక గొడవ పడకుండా ఉండటం అత్యంత అరుదుగా జరుగుతుంది.


ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన అత్యంత అరుదైన సంఘటనల్లో టాప్ 1లో ఉంటుంది. ఎందుకంటే.. పదుల సంఖ్యలో పిల్లుల మధ్యలో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. తిరగటమే కాదు.. పిల్లులు, ఎలుకలు కలిసి తిండి తింటున్నాయి. ఈ అత్యంత అరుదైన సంఘటన ముంబై హైకోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన అదితి సూర్యవంశీ అనే యువకుడు సోమవారం సాయంత్రం ముంబై హైకోర్టు బయట ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు.


ఓ చోట పుట్‌పాత్‌పై కొన్ని పిల్లులు కనిపించాయి. దాదాపు పది దాకా ఉన్న పిల్లులకు ఎవరో ఆహారం పెట్టి వెళ్లారు. అవి తింటూ ఉన్నాయి. అయితే, ఆ పిల్లులతో పాటు ఎలుకలు కూడా ఉన్నాయి. పిల్లులతో కలిసి అవి భోజనం చేస్తున్నాయి. అన్ని పిల్లులు ఉన్నా.. వాటిలో ఒక్కటి కూడా ఎలుకల్ని హింసించలేదు. ఆ దృశ్యాలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఫోన్ తీసి వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. రియల్ లైప్ టామ్ అండ్ జెర్రీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి

జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర అసహనం..

Updated Date - Jul 09 , 2025 | 08:07 AM