Share News

Car Stunt Accident: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. కొండ అంచున కార్‌తో స్టంట్ చేద్దామనుకుంటే..

ABN , Publish Date - Jul 13 , 2025 | 07:07 PM

రకరకాల వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది ప్రాణాంతక సాహసాలకు దిగుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఓ వ్యక్తి తన కారుతో చేసిన స్టంట్ తీరని నష్టం మిగిల్చింది.

Car Stunt Accident: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. కొండ అంచున కార్‌తో స్టంట్ చేద్దామనుకుంటే..
Car Stunt goes wrong

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా క్రేజ్ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. రకరకాల వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది ప్రాణాంతక సాహసాలకు (Dangerous Stunts) దిగుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ వ్యక్తి తన కారుతో చేసిన స్టంట్ తీరని నష్టం మిగిల్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Car Stunt Goes Wrong).


మహారాష్ట్ర సతారా జిల్లా సమీపం గుజర్వాడి గ్రామంలోని ఎత్తైన కొండపై ఓ వ్యక్తి కారుతో ప్రమాదకర స్టంట్ చేశాడు. కొండ అంచున కారుతో జీరో కట్ వేయడానికి ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి ఆ కారు కొండ అంచుకు వెళ్లిపోయింది. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ కారు నుజ్జునుజ్జయింది. ఆ కారులో కరాడ్ తాలూకాకు చెందిన సాహిల్ అనిల్ జాదవ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఘటనలో తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అతడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ప్రజాదరణ కోసం విన్యాసాలు చేసినప్పుడు, కొన్నిసార్లు ఫలితం చాలా కఠినంగా ఉండొచ్చని ఒకరు కామెంట్ చేశారు. పర్యాటక ప్రదేశాల్లో కఠినమైన పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు అవసరమని మరొకరు సూచించారు. ఈ అందమైన ప్రదేశాలు ఎప్పుడు మరణానికి కారణమవుతాయో ఎవరికీ తెలియదని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మంచులో ఆగి ఉన్న కారు.. మూడు పులులు ఏం చేశాయో చూడండి.. వీడియో వైరల్


మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ కుక్కల మధ్యలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2025 | 07:23 PM