Brave Boy Catches Snake: పట్టుమని పదేళ్లు లేవు.. నాలుగు అడుగుల పామును చేత్తో పట్టి..
ABN , Publish Date - Aug 22 , 2025 | 08:09 PM
Brave Boy Catches Snake: ఓ పిల్లాడు ఓ చేత్తో పామును తోకను పట్టుకున్నాడు. మరో చేత్తో పామును పట్టే ఇనుప కడ్డీతో పాము తలను నేలకు గట్టిగా అదిమి పట్టాడు. ఎంతో చాకచక్యంగా ఆ పాము తలను ఎడమ చేతిలోకి తీసుకున్నాడు.
పాములంటే భయపడని వారు ఎవరుంటారు చెప్పండి. పాములు పట్టే వాళ్లకు కూడా పామంటే భయం ఉండనే ఉంటుంది. ఎందుకంటే అది కాటేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే పాములు పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న వారు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ప్రాణాలతో బయటపడుతుంటే.. మరికొంతమంది చనిపోతున్నారు. ఈ విషయాలన్నీ తెలియని ఓ బాలుడు పామును ఒక ఆట ఆడుకున్నాడు.
పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ముంజు అనే మహిళా పోలీస్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఈ పిల్లాడు ప్రాణాలతో ఆటలాడుతున్నాడు. ఇక్కడ సాహసం ప్రాణాలు తీసే అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఇక, ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పిల్లాడు ఓ చేత్తో పామును తోకను పట్టుకున్నాడు. మరో చేత్తో పామును పట్టే ఇనుప కడ్డీతో పాము తలను నేలకు గట్టిగా అదిమి పట్టాడు.
ఎంతో చాకచక్యంగా ఆ పాము తలను ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని పైకి లేపాడు. అది అతడి చేతుల్లో గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ఆ పాము ఏకంగా అతడికంటే పొడవు ఉంది. అయినా అతడు భయపడలేదు. చేతికి చుట్టుకుంటున్నా కూడా దాన్ని వదిలేయలేదు. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వ్యక్తి వీడియో తీస్తుంటే పిల్లాడు ఎంతో శ్రద్ధగా వీడియోకు ఫోజు ఇచ్చాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. చిన్న పిల్లాడికి పాము పట్టేలా ట్రైనింగ్ ఇస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కూకట్‌పల్లి బాలిక కేసు.. డాడీ డాడీ అని అరుస్తుండగానే..
‘మిషన్ డాన్’.. కిల్లర్ బాలుడి లెటర్ చూస్తే హడలిపోవాల్సిందే..