Kukatpally Girl Horror Case: కూకట్‌పల్లి బాలిక కేసు.. డాడీ డాడీ అని అరుస్తుండగానే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:10 PM
Kukatpally Girl Horror Case: దొంగతనం కోసం ఓ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఓ పేపర్‌లో దొంగతనం ఎలా చేయాలి? ఎలా బయటపడాలి? అని వివరంగా రాసుకున్నాడు.
కూకట్‌పల్లిలో 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు బాలిక మర్డర్ కేసును ఛేదించారు. బాలికను 10వ తరగతి చదువుతున్న అబ్బాయి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బాలిక ఇంటి పక్కన ఉండే బిల్డింగ్‌లో నిందితుడు ఉంటున్నాడు. దొంగతనం కోసం బాలిక ఇంటికి వెళ్లాడు.
దొంగతనం కోసం ఓ పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఓ పేపర్‌లో దొంగతనం ఎలా చేయాలి? ఎలా బయటపడాలి? అని వివరంగా రాసుకున్నాడు. ఈ దొంగతనం ప్లాన్‌కు ‘మిషన్ డాన్’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. చోరీ సమయంలో బాలిక అతడ్ని చూడటంతో దారుణానికి ఒడిగట్టాడు. అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేశాడు. బాలిక బతికితే.. దొంగతనం గురించి బయటకు చెబుతుందేమోనన్న భయంతో 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
డాడీ, డాడీ అని అరుస్తుండగానే..
నిందితుడు బాలికను కత్తితో పొడుస్తున్న సమయంలో ‘డాడీ, డాడీ’ అంటూ గట్టిగా అరిచింది. అరుపులు బయటకు వినపడకుండా ఉండాలని గొంతులో కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. దాదాపు పదికిపైగా సార్లు గొంతుపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. కత్తి దాడిలో బాలిక చనిపోయింది. నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. విధులకు వెళ్లిన బాలిక తండ్రి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచి చూసి షాక్ అయ్యాడు. రక్తపు మడుగులో కన్న బిడ్డ పడి ఉండటం చూసి గట్టిగా గుండెలు అవిసేలా ఏడవటం మొదలెట్టాడు. అతడి అరుపులు, ఏడుపులు విని స్థానికులు అక్కడికి వచ్చారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. దాదాపు 5 రోజుల తర్వాత నిందితుడు దొరికాడు.
ఇవి కూడా చదవండి
వృద్ధుడి ప్రాణం తీసిన రొమాంటిక్ ఏఐ.. ముద్దిస్తా రా అనటంతో..
దెయ్యం పట్టిందని నమ్మించి మహిళపై దారుణం..