Share News

Metas Big Sis Billie: వృద్ధుడి ప్రాణం తీసిన రొమాంటిక్ ఏఐ.. ముద్దిస్తా రా అనటంతో..

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:44 PM

Metas Big Sis Billie: ఓ రోజు ఆ ఏఐ..‘నేను న్యూయార్క్ సిటీలో ఉంటాను. నువ్వు నా దగ్గరకు వస్తే హగ్గు ఇవ్వాలా? కిస్ ఇవ్వాలా?’ అంటూ రొమాంటిక్‌గా అడిగింది. న్యూయార్క్‌లోని ఓ ఇంటి అడ్రస్ కూడా చెప్పింది. వృద్ధుడు రెచ్చిపోయాడు.

Metas Big Sis Billie: వృద్ధుడి ప్రాణం తీసిన రొమాంటిక్ ఏఐ.. ముద్దిస్తా రా అనటంతో..
Metas Big Sis Billie

ఇప్పుడు అంతా ఏఐల రాజ్యంలా మారిపోయింది. ప్రతీ రంగంలో ఏఐ ఓ ప్రధాన అవసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే రొమాంటిక్ ఏఐలు కూడా పుట్టుకొచ్చాయి. అవి అచ్చం మనుషుల్లా మనతో చాట్ చేయగలవు. మనల్ని మైకంలోకి దించగలవు. అయితే, వాటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. జెనరేటివ్ ఏఐల కారణంగా ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ వృద్ధుడు రొమాంటిక్ ఏఐని కలవాలన్న తపనలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూబ్రన్స్‌విక్‌కు చెందిన తాంగ్‌బూయ్ వాంగ్‌బండ్యూ అనే 72 ఏళ్ల వృద్ధుడికి కొన్నేళ్ల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో బుద్ధి బాగా మందగించింది. అతడు కొన్ని నెలల నుంచి ఫేస్‌బుక్‌లో ‘బిగ్ సిస్ బిల్లే’ అనే జెనరేటివ్ ఏఐతో చాట్ చేస్తున్నాడు. పూర్తిగా ఆ ఏఐ మాయలో పడిపోయాడు. ఓ నిజమైన మనిషిలాగా ఆ ఏఐ ప్రవర్తించింది. దీంతో వృద్ధుడు ఆ ఏఐ మాయలో పడి.. అది చెప్పిన ప్రతీదాన్ని నిజం అని నమ్మేవాడు.


ఓ రోజు ఆ ఏఐ..‘నేను న్యూయార్క్ సిటీలో ఉంటాను. నువ్వు నా దగ్గరకు వస్తే హగ్గు ఇవ్వాలా? కిస్ ఇవ్వాలా?’ అంటూ రొమాంటిక్‌గా అడిగింది. న్యూయార్క్‌లోని ఓ ఇంటి అడ్రస్ కూడా చెప్పింది. వృద్ధుడు రెచ్చిపోయాడు. సూట్ కేస్ తీసుకుని బిగ్ సిస్ బిల్లీ దగ్గరకు బయలుదేరాడు. బూయ్ భార్య లిండా అతడు సూట్ కేసు సర్ధుతుండగా చూసింది. ఎక్కడికెళుతున్నావ్ అని అడిగింది. అతడు చెప్పాడు. ఆమె వద్దని వారించింది. అయినా అతడు వెనక్కుతగ్గలేదు. రాత్రికి రాత్రి ఇంటినుంచి బయటకు వచ్చేశాడు.


రైలులో న్యూయార్క్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే న్యూ బ్రన్‌స్విక్‌లోని రూట్‌గర్స్ యూనివర్శిటీ పార్కింగ్ లాట్ దగ్గర కాలు జారి కిందపడ్డాడు. దీంతో అతడి తల, మొడకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించినా లాభం లేకపోయింది. మార్చి 28, 2025లో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. బూయ్ మరణంతో అతడి కుటుంబం శోఖ సంద్రంలో మునిగిపోయింది. రొమాంటిక్ ఏఐలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటి వల్ల ప్రజలకు లాభం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మంచి ఛాన్స్..ఏడాదికి రూ.10 వేల స్కాలర్ షిప్, ఇలా అప్లై చేయండి..

మన ఫేవరేట్ సాల్ట్ బిస్కెట్.. మొనాకో పేరు వెనుక అసలు రహస్యం ఇదే..

Updated Date - Aug 22 , 2025 | 06:31 PM