Monaco Is Desi At Heart: మన ఫేవరేట్ సాల్ట్ బిస్కెట్.. మొనాకో పేరు వెనుక అసలు రహస్యం ఇదే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:01 PM
Monaco Is Desi At Heart: మొనాకో పేరు వెనకాల ఓ ఆశ్చర్యకరమైన విషయం దాగుంది. చాలా మంది ఆ సాల్ట్ బిస్కెట్లకు ‘మొనాకో’ అనే ఊరి పేరు పెట్టారని అనుకుంటూ ఉంటారు. ఫ్రెంచ్ రీవిఎరాలో మొనాకో అనే చిన్న నగరం ఉంది.
మొనాకో పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సాల్ట్ బిస్కెట్లే. సాల్ట్ బిస్కెట్లు ఇష్టపడేవారికి మొదటి చాయిస్ మొనాకోనే. మొనాకో బిస్కెట్లను వేడి వేడి టీలో ముంచుకుని తింటే ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఫీల్ ఉంటుంది. ఇక, అసలు విషయానికి వస్తే.. మొనాకో పేరు వెనకాల ఓ ఆశ్చర్యకరమైన విషయం దాగుంది. చాలా మంది ఆ సాల్ట్ బిస్కెట్లకు ‘మొనాకో’ అనే ఊరి పేరు పెట్టారని అనుకుంటూ ఉంటారు. ఫ్రెంచ్ రీవిఎరాలో మొనాకో అనే చిన్న నగరం ఉంది. ఆ నగరం పేరు ‘మొనాకో’. దాని పేరునే బిస్కెట్లకు పెట్టారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, అసలు విషయం అది కాదు..
పేరు వెనుక అసలు రహస్యం..
1929లో ముంబైకి చెందిన మోహన్‌లాల్, నాథాలాల్ అనే ఇద్దరు వ్యక్తులు విలే పార్లే ఏరియాలో ‘పార్లే’ కంపెనీ మొదలెట్టారు. 1942లో మొనాకో సాల్ట్ బిస్కెట్ల తయారీ మొదలైంది. మొనాకో అనే పేరు ఇద్దరు అన్నదమ్ముల పేర్లనుంచే వచ్చింది. మోహన్‌లాల్ నుంచి మోను.. నాథాలాల్ నుంచి నాను.. కంపెనీ నుంచి కోను తీసుకుని.. ‘మొనాకో’ పేరు పెట్టారు. అయితే, మొనాకో మార్కెట్‌లోకి వచ్చింది సాధారణ జనం కోసం కాదు. ప్రారంభంలో బిస్కెట్లు చాలా ఖరీదు ఉండేవి.
వాటిని ఖరీదైన టిన్నులో అమ్మేవారు. ఎక్కువ ప్రచారం.. ఇంగ్లీష్ పత్రికల్లో మాత్రమే జరిగేది. అయితే, మార్కెట్‌ను మరింత పెంచడానికి కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో సాధారణ జనం కోసం కూడా బిస్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజింగ్ కూడా మారిపోయింది. 2025లో మొనాకో బిస్కెట్లు 5 రూపాయల ప్యాక్ నుంచి అందుబాటులో ఉంటున్నాయి. మొనాకో ఇండియాలోని సాల్ట్ బిస్కట్స్ మార్కెట్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. ప్రతీ ఏటా ఇండియాలో సాల్ట్ బిస్కెట్లకు 1900 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఈ మొత్తం బిజినెస్‌లో పార్లె మొనాకో 25 శాతం మార్కెట్‌ను ఆక్యుపై చేసింది.
ఇవి కూడా చదవండి
50 గంటల అరెస్టుతో ఉద్యోగిని సస్పెండ్ చేస్తుంటే పీఎంలకు ఎందుకు వర్తించదు?
ఆధార్ ఆధారంగా బీహార్ ఓటర్ల జాబితా..సుప్రీంకోర్టు కీలక తీర్పు