Woman In Exorcism Ritual: దెయ్యం పట్టిందని నమ్మించి మహిళపై దారుణం..
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:25 PM
Woman In Exorcism Ritual: ఓ మహిళ అనారోగ్యంతో పాటు కుటుంబ సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ రషీద్ అనే బాబా దగ్గరకు వెళ్లింది. ఆమె కష్టాల్ని అతడు అవకాశంగా మలుచుకున్నాడు.
21వ శతాబ్ధంలోనూ మూఢ నమ్మకాలకు అడ్డుకట్టపడలేదు. కొంతమంది దొంగ బాబాల మాటలు నమ్మి నిండామోసపోతున్నారు. క్షుద్రపూజల పేరు చెప్పి కొంతమంది దొంగ బాబాలు మహిళల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా, ఓ దొంగ బాబా మహిళకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. క్షుద్రపూజల పేరు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో పాటు కుటుంబ సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ రషీద్ అనే బాబా దగ్గరకు వెళ్లింది. ఆమె కష్టాల్ని అతడు అవకాశంగా మలుచుకున్నాడు. ఆమె మీద కన్నేశాడు. ‘నీకు దెయ్యం పట్టింది. దాన్ని తొలగించాలంటే కొన్ని పూజలు చేయాలి’ అని చెప్పాడు. ఆమె అతడి మాటలు నమ్మింది. ఆగస్టు నెల మొదటి వారంలో అతడి దగ్గరకు వెళ్లింది. ఆ దొంగ బాబా పూజల పేరు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు.
అయితే, పూజలో భాగంగానే బాబా అలా చేశాడని ఆమె అనుకుంది. కొన్ని రోజుల తర్వాత అసలు విషయం అర్థమైంది. వెంటనే శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దొంగ బాబాపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ దొంగబాబాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుధవారం అబ్దుల్ రషీద్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
కోల్‌కతా మెట్రో ప్రాజెక్టు క్రెడిట్ నాదే.. మోదీ కార్యక్రమానికి మమత దూరం
వేగంగా వినియోగదారుల పరిష్కార కేసులు..ఒక్క నెలలోనే రూ.2.72 కోట్ల రీఫండ్‌లు