Share News

Bus Rams 9 Vehicles: బస్ డ్రైవర్‌కు పక్షవాతం.. 9 వాహనాలు ధ్వంసం..

ABN , Publish Date - Oct 13 , 2025 | 02:59 PM

బస్ అత్యంత వేగంగా ముందున్న ఆటోలు, కార్లు, బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. కండెక్టర్ చాలా కష్టపడి బస్‌ను ఆపాడు. లేదంటే మరిన్ని వాహనాలను బస్ ధ్వంసం చేసేది.

Bus Rams 9 Vehicles: బస్ డ్రైవర్‌కు పక్షవాతం.. 9 వాహనాలు ధ్వంసం..
Bus Rams 9 Vehicles

బెంగళూరులో భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్ రోడ్డుపై ఉన్న 9 వాహనాలపైకి దూసుకెళ్లింది. బస్ డ్రైవర్‌కు పక్షవాతం రావటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఓ ఆర్టీసీ బస్ బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర రోడ్డుపై వెళుతూ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ ఆగింది. బస్ ఆగిన కొన్ని క్షణాలకే బస్ డ్రైవర్‌కు పక్షవాతం వచ్చింది.


ఉన్నట్టుండి బస్ స్టీరింగ్‌పై పడ్డాడు. స్టీరింగ్ కదిలి బస్ ముందుకు దూసుకెళ్లింది. బస్ కండెక్టర్ బస్‌ను ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆయన వల్ల కాలేదు. బస్ అత్యంత వేగంగా ముందున్న ఆటోలు, కార్లు, బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. కండెక్టర్ చాలా కష్టపడి బస్‌ను ఆపాడు. లేదంటే మరిన్ని వాహనాలను బస్ ధ్వంసం చేసేది. ఈ ప్రమాదంలో మొత్తం 9 వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. వాటిలో 3 కార్లు, 3 ఆటోలు, 3 బైకులు ఉన్నాయి.


ఆ వాహనాలలోని వారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఏమీ కాలేదు. బస్ డ్రైవర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి నిలకడగా ఉంది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ధ్వంసం అయిన వాహనాల్లోని వారి అదృష్టం బాగుంది. లేదంటే ప్రాణాలు పోయేవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

పెళ్లి రద్దు చేసి.. అబ్బాయిని 'హగ్గింగ్ ఫీజు' డిమాండ్ చేసింది!

Updated Date - Oct 13 , 2025 | 03:14 PM