BJP MLA Ram Kadam: శపథం నెరవేరింది.. 4 ఏళ్ల తర్వాత హెయిర్ కట్ చేయించుకున్న ఎమ్మెల్యే..
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:40 PM
ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య తీర్చడానికి శపథం పన్నాడు. నాలుగేళ్ల పాటు హెయిట్ కట్ చేయించుకోలేదు. సమస్య తీరిన తర్వాత అందరి ముందుకు వచ్చి హెయిట్ కట్ చేయించుకున్నాడు.
రాజకీయ నాయకులంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోరన్న అభిప్రాయం ప్రజల్లో బాగా ఉంది. అతి కొద్ది మంది మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్లు ఎన్నికల సమయంలో తప్పితే తర్వాత కనిపించను కూడా కనిపించటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రజల సమస్య తీర్చడానికి శపథం పన్నాడు. నాలుగేళ్ల పాటు హెయిట్ కట్ చేయించుకోలేదు. సమస్య తీరిన తర్వాత అందరి ముందుకు వచ్చి హెయిట్ కట్ చేయించుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఘట్కోపర్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుగేళ్ల క్రితం నీటి సమస్యను తీరుస్తానని శపథం చేశాడు. నీటి సమస్య తీరే వరకు జుట్టు కత్తిరించుకోనని తేల్చి చెప్పాడు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఎంతో కష్టపడి ఆయన నీటి సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాడు. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. దీంతో రామ్ కదమ్ హెయిర్ కట్ చేయించుకోవటానికి సిద్ధమయ్యాడు. గురువారం ఓ గ్రామానికి వెళ్లి ఊరి ప్రజల ముందు హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదేళ్ల క్రితం నాలో ఆలోచన మొదలైంది. కొండ ప్రాంతాల్లోకి నీళ్లు ఎలా తీసుకురావాలా అనుకుంటూ ఉండేవాడిని.
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. 2 కోట్ల లీటర్ల నీటిని నిలువ చేసుకోవటానికి అవకాశం ఉండేలా ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. భందుప్ నుంచి ఇక్కడికి నీటి సరఫరా జరుగుతుంది. ఇక్కడ నీటిని సప్లయ్ చేస్తున్న విధానం దేశానికి ఓ రోల్ మోడల్ కానుంది. ఇదే మోడల్‌ను దేశంలోని మిగిలిన ప్రదేశాల్లో వాడే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుగేళ్ల తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటున్న దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఎమ్మెల్యేపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తిరుమల పరకామణి లెక్కింపుపై హైకోర్టు ఆదేశాలివే..
బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ మృతి