Share News

Chhattisgarh Maoist Encounter: బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ మృతి

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:12 PM

శుక్రవారం బీజాపూర్ జిల్లాలో డీఆర్‌జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

Chhattisgarh Maoist Encounter: బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ మృతి
Chhattisgarh Maoist Encounter

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య చోటుచేసుకుంటున్న ఎన్‌ కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. శుక్రవారం బీజాపూర్ జిల్లాలో డీఆర్‌జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇంద్రావతి ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.


ఉదయం నుంచి డీఆర్‌జీ బృందానికి, మావోయిస్టులకు మధ్య అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల ఘటనను ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ధృవీకరించారు. భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిపారు. కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అడవుల్లో మావోయిస్టులు, డీఆర్‌జీ బలగాల మధ్య గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. కిష్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ బలగాలు కూంబింగ్‌ చేపట్టగా ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. చనిపోయినవారు మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యులైన మడివి జోగా, సోది బండి, నుప్నో బజ్జీ (మహిళ)గా పోలీసులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి

కొడాలి నానికి ఊహించని షాక్.. ప్రధాన అనుచరుడు అరెస్ట్.

జట్టుకు ఇది సరిపోదు.. గిల్ ఫామ్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 19 , 2025 | 12:14 PM