Bizarre Road Construction: గ్రామ సర్పంచ్ మొండితనం.. నడి రోడ్డులో చేతి పంపు..
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:06 PM
గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ చేతి పంపునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు.
ఒకప్పుడు నీటి అవసరాలు తీర్చటంలో చేతి పంపులు ప్రధాన పాత్ర పోషించాయి. పదేళ్ల క్రితం వరకు దేశంలోని ప్రతీ గ్రామంలో చేతి పంపులు పెద్ద సంఖ్యలో ఉండేవి. కొళాయిల వాడకం పెరిగిపోయిన తర్వాత చేతి పంపులు మూలనపడిపోయాయి. కానీ, ఇప్పటికీ కొన్ని చోట్ల జనం నీటి అవసరాల కోసం చేతి పంపుల మీదే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం చేతి పంపునకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే.. సిమెంట్ రోడ్డు మధ్యలో చేతి పంపు ఉంది. దాని చుట్టూ రక్షణగా చిన్న చిన్న స్తంభాలు సైతం నిర్మించి ఉన్నాయి. దాదాపు ఓ మీటర్ లోతులో ఆ చేతి పంపు ఉంది. మధ్య ప్రదేశ్, సిద్ధి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ఈ చేతి పంపుపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతి పంపు చుట్టూ రోడ్డును నిర్మించిన ఇంజనీర్లపై మండిపడుతున్నారు. ఆ గొయ్యిలాంటి నిర్మాణంలోకి దిగి నీటిని తీసుకెళ్లటం ఇబ్బందిగా మారిందంటున్నారు.
గ్రామ సర్పంచ్ మనోజ్ బైగా చేతి పంపు చుట్టూ రోడ్డు వేయించాడని గ్రామస్తులు అంటున్నారు. సచిన్ సింగ్ అనే వ్యక్తి ఎంత చెప్పినా వినకుండా చేతి పంపు చుట్టూ రోడ్డు వేయించాడని చెబుతున్నారు. చుట్టూ రోడ్డు ఉండటం వల్ల చేతి పంపు నుంచి నీళ్లు తీసుకెళ్లటం చాలా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ చేసిన పని వల్ల గ్రామస్తులు మాత్రమే కాదు.. వాహనదారులు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ చేతి పంపు సమస్య ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడుతున్నాం.. క్యాన్ నుంచి వాటర్ ఎలా తీశాడో చూడండి..