Share News

Bear Stealing Chips: చిప్స్ ప్యాకెట్‌ను కొట్టేసిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

ABN , Publish Date - Dec 17 , 2025 | 08:16 PM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులు చేసే చిలిపి చేష్టలు చూస్తే ఎవ్వరైనా నవ్వాల్సిందే. అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.

Bear Stealing Chips: చిప్స్ ప్యాకెట్‌ను కొట్టేసిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లా, రాస్మోహనీ గ్రామంలో ఒక ఎలుగుబంటి అడవి నుంచి వచ్చి నివాస ప్రాంతంలోకి ప్రవేశించింది. సంతోష్ హల్వాయి కిరాణ దుకాణం ముందున్న ఫాస్ట్‌ఫుడ్ ట్రక్కులో నిల్వ ఉంచిన తినుబండారాల వాసన పసిగట్టింది. ఇంకేముంది మెల్లిగా వాహనం వద్దకు వెళ్లి అందులో నుంచి చిప్స్ ప్యాకెట్‌ని లాక్కొని అక్కడి నుంచి పారిపోయింది. చిప్స్ ప్యాకెట్ కోసం ఆ ఎలుగుబంటి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డైంది.


ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ఎలుగుబంటికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది.. అలాగా తెలివి కూడా ఉందని ఒకరు, ఆకలి ఎలాంటి పనైనా చేయిస్తుందని మరోకరు, అది చిలిపి ఎలుగుబంటిలా ఉంది.. కుర్ కురే కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి‌పూట అడవి జంతువులు నివాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వెలుపల ఆహార పదార్ధాలు, పానియాలు ఉంచడం మంచిది కాదని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..

ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..

Updated Date - Dec 17 , 2025 | 09:21 PM